Bull Rider : బుల్ రైడర్.. ఈ వీడియో చూస్తే నోరెళ్లబెడతారు !
Bull Rider : ‘ఘోస్ట్ రైడర్’ మూవీలోని పాత్ర గురించి మనకు తెలుసు. కానీ ఇప్పుడు మనం ‘బుల్ రైడర్’ను చూడబోతున్నాం.
- Author : Pasha
Date : 13-11-2023 - 7:33 IST
Published By : Hashtagu Telugu Desk
Bull Rider : ‘ఘోస్ట్ రైడర్’ మూవీలోని పాత్ర గురించి మనకు తెలుసు. కానీ ఇప్పుడు మనం ‘బుల్ రైడర్’ను చూడబోతున్నాం. ఔను.. ఇతడు తన బైక్‌పై ఎద్దును కూర్చోబెట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా పిల్లులు, కుక్కలను.. బైక్‌లు, కార్లలో తీసుకెళ్లడం మనం చూసి ఉంటాం. కానీ ఏమైందో ఏమో కానీ.. ఇతగాడు ఏకంగా ఎద్దును బైక్‌పై కూర్చోబెట్టుకొని డ్రైవింగ్ చేస్తూ కనిపించాడు. ఎద్దు కూడా అటూఇటూ కదలకుండా.. చక్కగా, కామ్‌గా బైక్‌పై కూర్చొని వెళ్తుండటాన్ని మనం ఈ వీడియోలో చూడొచ్చు.
This is how you ride the BULL in a rally. 😉#nifty50 #StockmarketIndia pic.twitter.com/J1jpEkk4EM
— Naresh Nambisan | നരേഷ് (@nareshbahrain) November 10, 2023
We’re now on WhatsApp. Click to Join.
నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఈ వీడియోను ఓ కారు డ్రైవర్ తన ఫోన్‌లో రికార్డ్ చేశాడు. నరేశ్ బహ్రెయిన్ (@nareshbahrain) అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనికి ఇప్పటివరకు లక్షలాదిగా వ్యూస్ వచ్చాయి. దీనిపై కామెంట్స్ కూడా పెద్దసంఖ్యలో వెల్లువెత్తాయి. ప్రపంచ వింతల్లో ఈ వీడియో ఒకటిగా నిలిచిపోతుందని కొందరు కామెంట్స్(Bull Rider) పెట్టారు.