Tomato Prices: ప్రజలను కంటతడి పెట్టిస్తున్న టమాట.. అలాంటి వీడియో షేర్ చేసిన రాహుల్ గాంధీ?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా టమాట ధరలు ఎలా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. టమాటా పేరు వింటేనే సామాన్యులు భయపడుతున్నారు. చాలామంది టమోటాలను కొనడమే మాన
- Author : Anshu
Date : 30-07-2023 - 5:15 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రస్తుతం దేశవ్యాప్తంగా టమాట ధరలు ఎలా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. టమాటా పేరు వింటేనే సామాన్యులు భయపడుతున్నారు. చాలామంది టమోటాలను కొనడమే మానేస్తున్నారు. ఇది ఇలా ఉంటే టమోటా ధరలు మండిపోతున్నాయి అని తాజాగా ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మార్కెట్‌లో కూరగాయల విక్రయదారుడు కన్నీళ్లు పెట్టిన వీడియో సామాన్య ప్రజలను కూరగాయల ద్రవ్యోల్బణం ఎంత తీవ్రంగా దెబ్బతీస్తుందో వెలుగులోకి తెచ్చింది. టమాటా ధరలను భరించలేక కూరగాయల విక్రేత కన్నీళ్లు పెట్టుకున్న వీడియో చూసిన వారి హృదయాలను కదిలిస్తోంది.
టమాటాలు ధరలు చాలా పెరిగాయని, వాటిని కొనుక్కోవడానికి కూడా తన దగ్గర సరిపడా డబ్బులేదని కూరగాయల విక్రేత రామేశ్వర్ కంటనీరు పెడుతూ చెప్పాడు. జహంగీర్ పురిలో నివసించే కూరగాయల విక్రేత, తన రిటైల్ దుకాణం కోసం టమాటాలు కొనడానికి తన కొడుకుతో కలిసి మార్కెట్‌కు చేరుకుని అక్కడ ధరలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాము ఆ కూరగాయలు ఏ ధరకు అమ్మాలా కూడా మాకు తెలియదని, వర్షంలో తడిసినా, ఏదైనా జరిగినా తాము నష్టపోతామని ఆయన బాధపడ్డారు. ఇతర కూరగాయల ధరలు కూడా భారీగా పెరిగాయని ఆయన అన్నారు.
देश को दो वर्गों में बांटा जा रहा है!
एक तरफ सत्ता संरक्षित ताकतवर लोग हैं जिनके इशारों पर देश की नीतियां बन रही हैं।
और दूसरी तरफ है आम हिंदुस्तानी, जिसकी पहुंच से सब्ज़ी जैसी बुनियादी चीज़ भी दूर होती जा रही है।
हमें अमीर-गरीब के बीच बढ़ती इस खाई को भर, इन आंसुओं को पोंछना… pic.twitter.com/zvJb0lZyyi
— Rahul Gandhi (@RahulGandhi) July 28, 2023
కూరగాయలు ధరలు పెరగడం తనను నిరాశా నిస్పృహలకు గురి చేసిందని, రోజుకు రూ. 100 200 కూడా సంపాదించలేనని విక్రేత తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కాగా ఆ వీడియోని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విటర్‌లో షేర్ చేస్తూ దేశాన్ని రెండు వర్గాలుగా విభజిస్తున్నారని అన్నారు. ఒకవైపు అధికారాన్ని కాపాడుకున్న శక్తివంతమైన వ్యక్తులు ఉన్నారు. వారి సూచనల మేరకు దేశ విధానాలు తయారు చేయబడుతున్నాయి. మరోవైపు సాధారణ భారతీయులకు కూరగాయలు వంటి ప్రాథమిక వస్తువులు కూడా అందకుండా పోతున్నాయి. ధనిక, పేదల మధ్య పెరుగుతున్న ఈ అంతరాన్ని మనం పూడ్చాలి. ఈ కన్నీళ్లను తుడవాలి అని రాహుల్ గాంధీ అన్నారు.