Himalayas From Space : ఆకాశం నుంచి హిమాలయాలను ఇప్పుడే చూడండి !!
Himalayas From Space : "ఎత్తు"లో హిమాలయాలకు మించిన కొలమానం మరొకటి ఉండదు.. బుర్జ్ ఖలీఫా అయినా హిమాలయాల ముందు చిన్నబోవాల్సిందే .. ప్రకృతి నిర్మాణంతో మనిషి పోటీ పడటం అసాధ్యం !!
- Author : Pasha
Date : 14-08-2023 - 3:22 IST
Published By : Hashtagu Telugu Desk
Himalayas From Space : “ఎత్తు”లో హిమాలయాలకు మించిన కొలమానం మరొకటి ఉండదు.. బుర్జ్ ఖలీఫా అయినా హిమాలయాల ముందు చిన్నబోవాల్సిందే .. ప్రకృతి నిర్మాణంతో మనిషి పోటీ పడటం అసాధ్యం !! 8849 మీటర్ల ఎత్తు ఉండే హిమాలయాలపైకి ఎక్కడమే మహా కష్టం.. హిమాలయాలను పైనుంచి చూసే ఛాన్స్ కేవలం పర్వతారోహకులకు మాత్రమే ఉంటుంది. ఇక ఆకాశం పై నుంచి చూస్తే హిమాలయాలు ఎలా కనిపిస్తాయి ? అనే క్యూరియాసిటీ చాలామందికి ఉంటుంది. అలాంటి వారికోసమే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చెందిన వ్యోమగామి సుల్తాన్ అల్ నెయాది అంతరిక్షం నుంచి కొన్ని ఫోటోలు తీసి పంపారు. వాటిని చూస్తే హిమాలయాల మొత్తం స్వరూపంపై ఒక అవగాహన వస్తుంది. వాటి అందాన్ని కూడా కళ్లారా ఆస్వాదించవచ్చు.
Also read : Tirumala : శేషాచలం అడవుల్లో సంచరిస్తున్న మరో 30 చిరుత పులులు – డీఎఫ్‌వో శ్రీనివాసులు
The Himalayas from space 🏔️
Home to the Everest summit, the highest point above sea level on earth, these mountains are one of the iconic landmarks of our planet's rich nature. pic.twitter.com/DiQqz0L95b
— Sultan AlNeyadi (@Astro_Alneyadi) August 12, 2023
ఆరు నెలల స్పేస్ మిషన్ కోసం సుల్తాన్ అల్ నెయాది ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో డ్యూటీ చేస్తున్నారు. అక్కడి నుంచి కెమెరాను క్లిక్ అనిపించి హిమాలయాల ఫోటోలను సుల్తాన్ అల్ నెయాది తీశాడు. వాటిని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడవి వైరల్(Himalayas From Space) అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసి నెటిజన్స్ వావ్ అంటూ నోరెళ్ళబెడుతున్నారు. ఇంత అద్భుతమైన ఫోటోలను తీసి పోస్ట్ చేసినందుకు చాలామంది నెటిజన్స్ సుల్తాన్ అల్ నెయాదికి థ్యాంక్స్ చెబుతున్నారు.
Also read : Dil Raju: బాలీవుడ్ లోకి దిల్ రాజు ఎంట్రీ, షాహిద్ కపూర్ తో భారీ మూవీకి ప్లాన్