Flight: విమానం గాల్లో ఉండగా బాత్రూంలో అలాంటి పని చేసిన జంట.. చివరికి?
ఈ మధ్య కాలంలో విమానాల్లో వింత వింత సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. విమానాల్లో కొందరి ప్రవర్తన తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురి
- By Nakshatra Published Date - 02:45 PM, Wed - 13 September 23
ఈ మధ్య కాలంలో విమానాల్లో వింత వింత సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. విమానాల్లో కొందరి ప్రవర్తన తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయడం తరచూ వార్తల్లో చూస్తున్నాం. పక్కవారితో అసభ్యంగా ప్రవర్తించడం లేదంటే ఫ్లైట్ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించడం లాంటివి చేస్తున్నారు. కొందరు అయితే రొమాన్స్ చేసుకోవడానికి ఎక్కడ ప్లేస్ లేనట్టు ఫ్లైట్ లో కూడా ఆ పని కానిచ్చేస్తున్నారు. తాజాగా కూడా ఒక ఒక జంట గాల్లో ఉండగా అలాంటి పని చేసింది.
ఈ ఘటన యూకేలోని లూటన్ నుంచి ఇబిజాకు వెళుతున్న విమానంలో చోటు చేసుకుంది. ఈజీ జెట్ సంస్థకు చెందిన విమానం ఇబిజాకు బయలు దేరింది. ఈ క్రమంలో ఇద్దరు ప్రయాణికులు బాత్రూం లోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. కాసేపటికి సిబ్బందిలో ఒకరు తలుపు తెరవమని కోరగా ఆ జంట ఏ మాత్రం స్పందించలేదు. దీంతో సిబ్బంది బలవంతంగా డోర్ తెరిచారు. లోపల కనిపించిన దృశ్యాన్ని చూసి సిబ్బంది సహా అక్కడున్న వారు షాక్ అయ్యారు. విమానం గాల్లో ఉండగానే అసభ్యకర రీతిలో ఆ జంట శృంగారం చేస్తూ కనిపించారు.
అయితే ప్రయాణికుల్లో ఒకరు ఇదంతా వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. విమానం ఇబిజాలో ల్యాండ్ అయిన అనంతరం ఆ జంటను పోలీసులకు అప్పగించినట్లు ఈజీ జెట్ సంస్థ తెలిపింది. అయితే ఆ జంటపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది మాత్రం వెల్లడించలేదు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ జంటకు ఆ పని చేయడానికి ప్లేస్ దొరకనట్టు ఉంది అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అలాంటి వాళ్లకు గట్టిగా బుద్ధి చెప్పాలి మరొకసారి అలాంటి తప్పు చేయడానికి వేరే వాళ్ళు భయపడాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Related News
Visakhapatnam: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. విశాఖ నుంచి బ్యాంకాక్ కు డైరెక్ట్ ఫ్లైట్
Visakhapatnam: ఎయిర్ ఏషియా విశాఖపట్నం-బ్యాంకాక్ మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులను ప్రారంభించింది. కోవిడ్ -19 మహమ్మారి తర్వాత విశాఖపట్నం నుండి విదేశీ విమానాన్ని ప్రవేశపెట్టిన రెండవ అంతర్జాతీయ విమానయాన సంస్థగా నిలిచింది. విశాఖపట్నం నుంచి సింగపూర్ కు తొలి అంతర్జాతీయ విమానం స్కూట్. వారానికి మూడు సార్లు (మంగళ, గురు, శనివారాలు) బ్యాంకాక్ కు ఎయిర్ ఏషియా విమానాలను నడపనుంది. బ్యాంకాక్ ను�