Army Soldiers : విధులు పక్కన పెట్టి శృంగారంలో మునిగిపోయిన జవాన్లు..అది కూడా ఎక్కడో తెలుసా..?
Army Soldiers : జవాన్లు..తమ విధులను పక్కన పెట్టి శృంగారంలో(Romance) మునిగిపోయారు..అది కూడా హెలికాప్టర్‌లోని కాక్‌పిట్‌లో..ఈ ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకోగా
- By Sudheer Published Date - 10:33 PM, Fri - 15 November 24

ఆర్మీ జవాన్లు (Army Soldiers) ఎంత జాగ్రత్తగా ఉండాలి..నిత్యం డేగ కన్నులతో శత్రులపై నిఘా పెడుతూ ఉండాలి..ఏమాత్రం అజాగ్రత్త వహించిన పెను ప్రమాదం చోటుచేసుకుంది. మరి ఆలా ఉండాల్సిన జవాన్లు..తమ విధులను పక్కన పెట్టి శృంగారంలో(Romance) మునిగిపోయారు..అది కూడా హెలికాప్టర్‌లోని కాక్‌పిట్ (cockpit )లో..ఈ ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకోగా..ఈ విషయం బయటకు వచ్చి వైరల్ గా మారింది. బ్రిటన్‌లోని సైనిక శిక్షణా ప్రాంతంలో ఉన్న ఓ అపాచీ హెలికాప్టర్ (Rs 75 Crore Military Helicopter)లో వింత శబ్దాలు వస్తుండడంతో అక్కడే ఉన్న మెయింటెనెన్స్ సిబ్బంది ఏంటా ఆశబ్దాలు అని దగ్గరికి వెళ్లి చూడగా..ఒక్కసారిగా వారు షాక్ అయ్యారు. ఓ మహిళ, పురుష జవాన్లు శృంగారం లో మురిగిపోవడం చూసారు.
ఆ క్షణంలో వారిద్దరు సైనికులు.. అర్ధనగ్నంగా ఉన్నట్లు గుర్తించి..వారిని వెంటనే బట్టలు వేసుకుని బయటికి రావాలని హెచ్చరించారు. అందులో పురుష సైనికుడు మిలిటరీ బట్టల్లోనే ఉండగా.. ఆ మహిళ సాధారణ డ్రెస్‌లో ఉన్నట్లు మిలిటరీ ఏవియేషన్ అథారిటీకి మెయింటెనెన్స్ స్టాఫ్ నివేదిక ఇచ్చారు. అయితే ఆ సమయంలో వారిద్దరూ మద్యం సేవించి ఉన్నట్లు తెలిపారు. పట్టుబడిన చాపర్ ఆర్మీ ఎయిర్ కార్ప్స్ 653 స్క్వాడ్రన్‌కు చెందిందని తెలిపారు. అయితే వారిద్దరు మాత్రం వేరే ఆర్మీ యూనిట్‌కు చెందిన వారు అని పేర్కొన్నారు. వారు 653 స్క్వాడ్రన్ యొక్క చైన్ ఆఫ్ కమాండ్.. సంఘటనా స్థలానికి వచ్చే వరకు వారిని నిర్బంధించినట్లు మిలిటరీ ఏవియేషన్ అథారిటీ రిపోర్ట్ తెలిపింది.
Read Also : Ka : రూ.50 కోట్ల క్లబ్ లో చేరిన ‘క’..ఇది కదా హిట్ అంటే..!!