Forehead Tattoo : నుదిటిపై టాటూగా లవర్ నేమ్.. విపరీతంగా ట్రోల్ చేసిన నెటిజన్లు.. చివరికిలా..
పిచ్చి పదిరకాలంటే ఏంటో అనుకున్నా కానీ.. ఇప్పుడు నిన్ను చూస్తే తెలుస్తోంది. ఒకవేళ బ్రేకప్ అయితే ఆ టాటూని ఏం చేస్తావ్ అని ఒక నెటిజన్ అంటే.. మరికొందరు.. ప్రేమలో నిజాయితీగా
- By News Desk Published Date - 02:16 PM, Mon - 13 November 23
Forehead Tattoo : పిచ్చి పలురకాలంటారు. ముఖ్యంగా ప్రేమలో ఉన్నప్పుడు ఇష్టమైన వ్యక్తిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేసేందుకు రకరకాల పనులు చేస్తుంటారు. బహుమతులు, సర్ ప్రైజ్ లు ప్లాన్ చేయడం వరకూ ఓకే. కొందరైతే తమ లవర్ పేరును చేతులు, గుండెలపై, మెడపై టాటూ వేయించుకుంటారు. కానీ.. ఓ యువతి మాత్రం వీటన్నింటికీ భిన్నంగా.. జీవితాంతం గుర్తుండేలా.. తన ముఖం చూసిన ప్రతిఒక్కరికీ కనిపించేలా నుదిటిపై బాయ్ ఫ్రెండ్ పేరును టాటూ వేయించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
నేటి కాలంలో టాటూలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఒకానొకప్పుడు సెలబ్రిటీలవరకే పరిమితమైన ఈ టాటూలు.. ఇప్పుడు సామాన్యుల వరకూ ట్రెండ్ గా మారాయి. యూకేకు చెందిన ఓ యువతి.. తన ప్రియుడిపై ఉన్న ప్రేమను వినూత్నంగా వ్యక్తం చేయాలని ఆలోచించి.. ఏకంగా నుదిటిపై పచ్చబొట్టు వేయించుకుంది. ఈ వీడియోను ఆమె నెట్టింట్లో పోస్ట్ చేయగా.. నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.
పిచ్చి పదిరకాలంటే ఏంటో అనుకున్నా కానీ.. ఇప్పుడు నిన్ను చూస్తే తెలుస్తోంది. ఒకవేళ బ్రేకప్ అయితే ఆ టాటూని ఏం చేస్తావ్ అని ఒక నెటిజన్ అంటే.. మరికొందరు.. ప్రేమలో నిజాయితీగా ఉంటే.. ఇలాంటి స్టంట్స్ చేయాల్సిన అవసరం ఏం ఉంది అని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు.. ఆ టూటూ ఫిల్లింగ్ చూస్తుంటే ఫేక్ లా కనిపిస్తోందని, పబ్లిసిటీకోసం చేసి ఉంటుందని ట్రోల్ చేశారు. దాంతో ఆమె నెటిజన్ల కామెంట్లపై రియాక్ట్ అయింది.
“ఇది నిజమైన పచ్చబొట్టు.. నా బాయ్ ఫ్రెండ్ పై నాకెంత ప్రేమ ఉందో వ్యక్తం చేసేందుకే వేయించుకున్నా. మీరంతా అనుకుంటున్నట్లు మాకు బ్రేకప్ జరగదు. కెవిన్ తో చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నాను. అద్దంలో చూసుకున్న ప్రతిసారి అతను నాతోనే ఉన్నట్లు ఉంటుంది. నాకు లేని ఇబ్బంది మీ అందరికీ ఎందుకో” అంటూ.. ట్రోలర్స్ కు గట్టిగానే సమాధానమిచ్చింది. తాజాగా.. తాను నుదిటిపై వేయించుకున్న టాటూ ఫేక్ అని.. టాటూల గురించి అవగాహన కల్పించేందుకే తాను ఈ పనిచేసినట్లు వెల్లడించింది. ఆమె నుదిటిపై టాటూ వేయించుకున్న వీడియో ఇప్పటికే 30 మిలియన్ మందికిపైగా చూశారు.
https://www.instagram.com/p/CzRH9ONSPq8/
Related News
Gold-Silver Panipuri : బంగారం-సిల్వర్తో పానీపూరీ.. టేస్ట్ అయితే.. యమ్మీ..!
భారతదేశంలో స్ట్రీట్ ఫుడ్ విషయానికి వస్తే, పానీ పూరీ ఖచ్చితంగా చాలా మందికి అగ్రస్థానంలో ఉంటుంది. సన్నని, స్ఫుటమైన వృత్తాకార క్రస్ట్, ఒక పెద్ద చిటికెడు గుజ్జు బంగాళాదుంపల కోసం ఖాళీ చేసి రంధ్రంలో మసాలా, చిక్కగా ఉండే చింతపండు నీటితో నింపి తింటే.. ఆహా ఆ రుచే వేరు.