Viral: ఆ స్టార్ హీరో రోడ్డు మీద చెత్త ఏరిన వీడియో వైరల్!
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ఇండస్ట్రీ మలయాళ సినీ ఇండస్ట్రీ.
- By Nakshatra Updated On - 08:33 PM, Sun - 15 January 23

Viral: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ఇండస్ట్రీ మలయాళ సినీ ఇండస్ట్రీ. కంటెంట్ బాగా ఉండే సినిమాలను ఎక్కువగా తీసే ఈ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో మోహన్ లాల్. మలయాళంలో మోహన్ లాల్ సినిమా చేస్తున్నాడు అంటే అక్కడో అదో సంచలనం. మోహన్ లాల్ కేవలం సినిమా హీరోగానే కాకుండా, ఎంతో సింపుల్ గా ఉంటారనే పేరు ఉంది.
సినీ హీరో అనే పొగరు కానీ గర్వం కానీ మోహన్ లాల్ లో ఏ కోశాన లేదు అని ఆయన ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే తాజాగా మోహన్ లాల్ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మా హీరో ఎంత సింపుల్ గా ఉంటాడో, ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారో చెప్పడానికి ఈ వీడియోనే నిదర్శనం అంటూ మోహన్ లాల్ ఫ్యాన్స్ సదరు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
మోహన్ లాల్ కనిపిస్తున్న చాలా చిన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆ వీడియో ప్రకారం కారు దిగిన మోహన్ లాల్.. రోడ్డు మీద పడి ఉన్న చెత్త కాగితాలను ఏరుతున్న విజువల్స్ కనిపించాయి. కారు దిగిన మోహన్ లాల్.. పరిసరాలు ఎంతో శుభ్రంగా ఉండి, కారు ముందు మాత్రం చెత్త కాగితాలు పడి ఉండటాన్ని గమనించి వాటిని ఏరుతున్నట్లు తెలుస్తోంది.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రతి ఒక్కరు పాలు పంచుకోవాలని, సామాన్యులతో పాటు తాను కూడా దీనికి అతీతం కాదన్నట్లు మోహన్ లాల్ సందేశం ఇస్తున్నట్లు ఆయన అభిమానులు అంటున్నారు. మోహన్ లాల్ సింప్లిసిటీకి నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. కాగా మోహన్ లాల్ ప్రస్తుతం రజినీ హీరోగా తెరకెక్కుతున్న ‘జైలర్’ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కాకుండా బరోస్, రామ్, ఎంపురాన్, మలైకోట్టై వాలిబన్, ఎలోన్ సినిమాలు చేస్తున్నట్లు సమాచారం.
