Taliban – Amitabh : అమితాబ్ తో మాకు అవినాభావ సంబంధం.. తాలిబన్ల ట్వీట్ వైరల్
Taliban - Amitabh : మన బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు ఎంత పాపులారిటీ ఉందో మరోసారి తెలిసొచ్చింది.
- By Pasha Published Date - 12:24 PM, Sun - 8 October 23
Taliban – Amitabh : మన బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు ఎంత పాపులారిటీ ఉందో మరోసారి తెలిసొచ్చింది. ఆయన పాపులారిటీ దేశం సరిహద్దులను దాటి విస్తరించిందని వెల్లడైంది. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ ను పాలిస్తున్న తాలిబన్లు కూడా ‘‘అమితాబ్ కు ఫిదా అవుతున్నాం’’ అంటూ ట్వీట్ చేశారు. తాలిబాన్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ఈమేరకు ఒక పోస్టు పెట్టింది. అమితాబ్ నటనపై ప్రశంసల జల్లు కురిపించారు. మా హావభావాలు, మా జీవన విధానాన్ని అద్దంపట్టే చాలా సినిమాలను అమితాబ్ చేశారని తాలిబన్లు గుర్తు చేశారు. దీనికి సంబంధించిన ఒక ఫొటోను కూడా పోస్ట్ చేశారు.1980వ దశకంలో అమితాబ్ ఆఫ్ఘనిస్తాన్ లో పర్యటించినప్పుడు.. ఆనాటి అధ్యక్షుడు నజీబుల్లా ఆయనకు ‘గౌరవ పౌరసత్వాన్ని’ అందించిన విషయం చాలామందికి తెలియదని చెప్పారు. అమితాబ్ కు పరోక్షంగా ఆఫ్ఘనిస్తాన్ తో మంచి సంబంధం ఉందని, ఆయన నటనను ఇష్టపడే వారు చాలామంది ఉన్నారని పేర్కొన్నారు. తాలిబన్లు ఈమేరకు వివరాలతో ట్విట్టర్ లో పోస్ట్ ను అప్ లోడ్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు లక్షలాది వ్యూస్ వచ్చాయి. ఈ పోస్ట్‌పై చాలామంది నెటిజన్స్ కామెంట్స్ కూడా చేశారు.
We’re now on WhatsApp. Click to Join
Amitabh Bachchan is an Indian actor and a masculine individual who is well-liked in Afghanistan. Few people are aware that he is an honorary Afghan citizen. When he visited our magnificent nation in the 1980s, President Najibullah bestowed this distinguished accolade upon him. pic.twitter.com/ZTvupuP7lm
— Taliban Public Relations Department, Commentary (@TalibanPRD__) October 7, 2023
ఈ ట్వీట్ పై కొందరు డిఫరెంట్ గా స్పందించారు. బహుశా తాలిబన్ల పేరడీ అకౌంట్ నుంచి ఈ పోస్టును పెట్టి ఉండొచ్చని, ఇది అధికారిక అకౌంట్ కాకపోవచ్చని కొందరు నెటిజన్స్ అభిప్రాయపడ్డారు. మరికొందరు నెటిజన్స్ స్పందిస్తూ.. తమకు కూడా ఆఫ్ఘనిస్తాన్ లో గౌరవ పౌరసత్వం కావాలని, ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీనికి తాలిబన్ల పేరిట ఉన్న ఆ అకౌంట్ నుంచి వివిధ రకాల జవాబులు వచ్చాయి. సొంత దేశంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్లకు.. ఇతర దేశాల్లో పౌరసత్వాలు ఈజీగా వస్తాయని తాలిబన్లు బదులిచ్చారు. కొందరు క్రికెటర్ల ఫొటోలపై, భారత్ పేరుపైనా కొంత చర్చ జరిగింది. పై ట్వీట్ ను క్లిక్ చేస్తే మీరు కూడా అవన్నీ (Taliban – Amitabh) చూడొచ్చు.
Also read : Telangana : రైతులందరికీ పెన్షన్ ఇచ్చే ఆలోచనలో సీఎం కేసీఆర్..?
Related News
Pakistan Air Strikes : పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్.. 8 మంది మృతి
Pakistan Air Strikes : ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ సైన్యం విరుచుకు పడింది.