Super Dog : సూపర్ డాగ్.. ఐదు అంతస్తుల నుంచి దూకినా ఏమీ కాలేదు !!
Super Dog : మనం భవనం మొదటి అంతస్తు నుంచి దూకినా కాళ్లు చేతులు విరగడం ఖాయం. అలాంటిది ఓ కుక్క సాహసం చేసింది.
- Author : Pasha
Date : 20-10-2023 - 5:41 IST
Published By : Hashtagu Telugu Desk
Super Dog : మనం భవనం మొదటి అంతస్తు నుంచి దూకినా కాళ్లు చేతులు విరగడం ఖాయం. అలాంటిది ఓ కుక్క సాహసం చేసింది. ఏకంగా ఐదు అంతస్తుల భవనం పై నుంచి సూపర్ డాగ్ లా జంప్ చేసింది. అయినా అది సేఫ్ గా నేలపై ల్యాండ్ అయింది. దాని కాళ్లకు ఎలాంటి గాయాలు కాలేదు. బిల్డింగ్ పై నుంచి దూకిన తర్వాత.. ఆ కుక్క నార్మల్ గా నడుచుకుంటూ తన దారిన తాను వెళ్లిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు.. సూపర్ డాగ్ అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
Jumps from 5th floor & continues walking normally… How is this possible? pic.twitter.com/uGEEnRkr5g
— Dr. Ajayita (@DoctorAjayita) October 18, 2023
పైన ఉన్న వీడియోను చూడండి.. నిర్మాణంలో ఉన్న భవనం ఇది. ఇందులోని ఐదో అంతస్తులో చివరన కుక్క నిలబడి ఉంది. అది ఏమీ ఆలోచించకుండా అమాంతం కిందికి దూకేసింది. కిందకు ల్యాండ్ అయ్యే క్రమంలో.. భవనం గోడకు తన కాళ్లను సపోర్ట్ గా చేసుకుంది. కిందపడగానే లేచి పరుగెత్తుకుంటూ వెళ్లిపోయింది. అయినా ఆ కుక్కకు గాయాలు కాకపోవడం గమనార్హం. ఈ సూపర్ డాగ్ కు సంబంధించిన వీడియో ఫుటేజీ అమెరికాలోని టెక్సాస్ ఏరియాకు చెందినదని (Super Dog) తెలుస్తోంది.