KKR vs SRH: షారుఖ్ ఖాన్ స్మోకింగ్ వీడియో వైరల్
స్మోకింగ్ అలవాటున్న షారుఖ్ ఖాన్ బహిరంగంగానే సిగరెట్ తాగుతుంటాడు. గతంలో ముంబై విమానాశ్రయంలో స్మోక్ చేస్తూ కనిపించాడు. అప్పట్లో అది వివాదానికి దారి తీసింది.
- By Praveen Aluthuru Published Date - 11:09 AM, Sun - 24 March 24
KKR vs SRH: శనివారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆతిథ్య జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో కేకేఆర్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆండ్రీ రస్సెల్ 25 బంతుల్లో 65 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. షారుఖ్ ఖాన్ తన జట్టుకు మద్దతుగా స్టేడియానికి చేరుకోవడం గమనార్హం. అయితే షారుక్ కు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
స్మోకింగ్ అలవాటున్న షారుఖ్ ఖాన్ బహిరంగంగానే సిగరెట్ తాగుతుంటాడు. గతంలో ముంబై విమానాశ్రయంలో స్మోక్ చేస్తూ కనిపించాడు. అప్పట్లో అది వివాదానికి దారి తీసింది. తాజాగా కేకేఆర్, సన్ రైజర్స్ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనూ షారుఖ్ స్మోక్ చేస్తూ కెమెరాకు చిక్కాడు.ఇది కాస్త వైరల్ గా మారింది.
కాగా హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో కోల్కతా అదరగొట్టింది. ఆండ్రీ రస్సెల్ 25 బంతుల్లో 64 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. రస్సెల్‌తో పాటు ఫిల్ సాల్ట్ 54 పరుగులతో బలమైన ఇన్నింగ్స్ ఆడాడు. కాగా రింకూ సింగ్ 23 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో హైదరాబాద్ తరఫున నటరాజన్ మూడు వికెట్లు తీశాడు.
https://twitter.com/i/status/1771571850104951189
Also Read: IPL Points Table 2024: ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. మొదటి మూడు స్థానాల్లో ఉన్న జట్లు ఇవే..!