Rats Killed Baby : నెలల పసికందుపై ఎలుకలు దాడి.. చిన్నారి మృతి..!
Rats Killed Baby ఇంట్లో చంటి పాపలు నెలల పిల్లలు ఉన్నప్పుడు వారి పరిసర ప్రాంతాలను పూర్తిగా గమనించాలి ఏమాత్రం అశ్రద్ధ చేసినా
- By Ramesh Published Date - 06:29 PM, Sat - 23 September 23

Rats Killed Baby ఇంట్లో చంటి పాపలు నెలల పిల్లలు ఉన్నప్పుడు వారి పరిసర ప్రాంతాలను పూర్తిగా గమనించాలి ఏమాత్రం అశ్రద్ధ చేసినా సరే ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఇలానే ఉయ్యాలలో వేసిన పసు కందుని గమనించకుండా పనుల్లో ఉన్న తల్లిదండ్రులకు పెద్ద షాక్ తగిలింది. ఏకంగా వారు ఆ చిన్నారిని కోల్పోవాల్సి వచ్చింది. ఇంతకీ అసలేం జరిగింది అంటే ఇండియానా లో నివాసం ఉంటున్న డేవిడ్, ఏంజిల్ షానాబాం లకు 6 నెలల పాప ఉంది.
అయితే ఉయ్యాలలో హాయిగా పడుకుని కదా అనుకున్న వారికి అందులో ఎలుకలు ఉన్నాయన్న విషయాన్ని గమనించలేదు. ఎలుకలు ఎక్కువగా ఉన్న ఆ ఏరియాలో వారి పాప ఉయ్యాలలో ఎలుకలు దూరాయన్న విషయాన్ని చూడలేదు. పాప నిద్రిస్తున్న టైం లో వాళ్లు వారి పనుల్లో బిజీ అయ్యారు. తీరా వచ్చి చూసే సరికి ఎలుకలు అన్నీ కలిసి పాప మీద దాడి చేశాయి. ఎలుకలు పాప చర్మాన్ని తినడం మొదలు పెట్టాయి. పాప ఎంత ఏడుస్తున్నా నిద్రలో అనుకుని తల్లిదండ్రులు పట్టించుకోలేదు.
ఏకంగా ఎలుకలన్నీ కలిసి ఆ పాప ఎముకలు బయటకు కనిపించే రేంజ్ లో కొరుక్కు తిన్నాయి (Rats Killed Baby). పేరెంట్స్ వచ్చి చూసే సరికి ఉయ్యాలలో ఎలుకలు చూసి నిర్గాంతపోయారు. ఎలుకల దాడి వల్ల వారి పాప ఒళ్లంతా గాట్లు పడగా పాపని హాస్పిటల్ కు తీసుకెళ్లినా లభం లేకుండాపోయింది. ఎలుకల దాడి వల్ల పసికందు మృతి చెందింది.
ఉయ్యాలలో పడుకున్న పాపని ఎలుకలు పొట్టొనపెట్టుకున్నాయి. చిన్న పిల్లలు ఉన్న టైం లో పరిసర ప్రాంతాలను తరచు గమనిస్తూనే ఉండాలి. వారికి ఏమి తెలియదు కాబట్టే తల్లిదండ్రులే ఎక్కువ శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. ఒక్క అజాగ్రత్త వల్ల ఎలుకల దాడి చేసి చిన్నారిని కోల్పోయారు.
Also Read : Muslim man Md Siddhik doing Ganesh Navaratri ముస్లింలు చేస్తున్న గణేష్ నవరాత్రులు.. ఎక్కడో తెలుసా..!