Viral : వీడు మామూలోడు కాదు..ఏకంగా తలపై ఫ్రిజ్ పెట్టుకుని సైకిల్ తొక్కాడు
ఓ వ్యక్తి తన తలపై బరువైన రిఫ్రిజిరేటర్‌ని బ్యాలెన్స్ చేస్తూ న్యూయార్క్ వీధుల్లో సైకిల్ తొక్కాడు. అది చూసిన అక్కడి స్థానికులు అతని ఫోటోలు, వీడియోలు తీసేందుకు తెగ ఎగబడ్డారు.
- Author : Sudheer
Date : 06-10-2023 - 4:34 IST
Published By : Hashtagu Telugu Desk
ఇటీవల కాలంలో సోషల్ మీడియా (Social Media) వాడకం బాగా పెరిగింది. ప్రతి ఒక్కరు సోషల్ మీడియా కు బాగా అలవాటు పడ్డారు. ఉదయం లేచినదగ్గరి నుండి పడుకునే వరకు ఎక్కువ సమయం దీనితోనే గడుపుతున్నాడు. దీంతో చాలామంది తమ టాలెంట్ ను నిరూపించుకునే పనిలో పడ్డారు. కొంతమందైతే రాత్రికి రాత్రే ఫేమస్ అవుతున్నారు. ఇందుకు కోసం రకరకాల విన్యాసాలు..సాహసాలు , కామెడీలు , డాన్సులు , ప్రాంక్స్ , వంటలు అబ్బో ఒకటి కాదు రకరకాలుగా ట్రై చేస్తూ ఫేమస్ అయ్యేందుకు కష్టపడుతున్నారు.
తాజాగా ఓ వ్యక్తి ఏకంగా తలపై ఫ్రిజ్ పెట్టుకుని సైకిల్ తొక్కుతూ వార్తల్లో నిలిచాడు. అగ్రరాజ్యం న్యూయార్క్(New York) నగరంలో ఇది జరిగింది. ఓ వ్యక్తి తన తలపై బరువైన రిఫ్రిజిరేటర్‌ని బ్యాలెన్స్ చేస్తూ న్యూయార్క్ వీధుల్లో సైకిల్ తొక్కాడు. అది చూసిన అక్కడి స్థానికులు అతని ఫోటోలు, వీడియోలు తీసేందుకు తెగ ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో షేర్ చేయగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్(Viral Video)గా మారింది. ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ‘బార్‌స్టూల్ స్పోర్ట్స్’లో ఈ వీడియో పోస్ట్ చేయబడింది. సెప్టెంబర్ 3న దీనిని షేర్ చేయగా 7 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ప్రపంచంలోనే అత్యంత బలమైన మెడ అనే క్యాప్షన్ తో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Read Also : Diwali : దీపావళి రోజున.. కేవలం 2 గంటల పాటు మాత్రమే పటాకులు కాల్చాలంటూ ప్రభుత్వం ఆదేశం
వీడియో కోసం ఈ లింక్ క్లిక్ చెయ్యండి