Maha Kumbh Mela : మోనాలిసా ఎక్కడికి వెళ్లిపోయిందో తెలుసా..?
Maha Kumbh Mela : కుంభమేళా (Mahakumbh Mela) ప్రయాగ్‌రాజ్‌లో ఆమె రుద్రాక్ష మాలలు, ముత్యాల హారాలు అమ్ముతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
- Author : Sudheer
Date : 24-01-2025 - 3:40 IST
Published By : Hashtagu Telugu Desk
సహజ సౌందర్యం, అమాయకపు చిరునవ్వుతో వైరల్ గా మారిన మోనాలిసా భోస్లే (Monalisa Bhosle) (16)..దుండగుల వేదింపులు తాళలేక ఇండోర్ వెళ్లిపోయింది. గత ఐదు రోజులుగా మోనాలిసా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. కుంభమేళా (Mahakumbh Mela) ప్రయాగ్‌రాజ్‌లో ఆమె రుద్రాక్ష మాలలు, ముత్యాల హారాలు అమ్ముతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మార్చేశాయి. హీరోయిన్ కు మించి అందం ఉండడంతో ఆమె చుట్టూ కుర్రకారు చేరారు.
Capital : అప్పటిలోగా అమరావతి నిర్మాణం పూర్తి : మంత్రి నారాయణ
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మోనాలిసా, పిల్లి కళ్లు, డస్కీ స్కిన్‌తో సెన్సేషన్‌గా మారింది. కుంభమేళాకు వెళ్లిన ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్.. మోనాలిసాను చూసి ఆమెను వీడియో తీస్తూ అడిగిన ప్రశ్నలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఆ తర్వాత అనేక మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఆమె వద్దకు చేరుకుని ఇంటర్వ్యూలు చేయడం ప్రారంభించారు. మొదట చిరునవ్వుతో వెలిగిపోయిన మోనాలిసా మొహం.. ఆ తర్వాత ఈ ఇన్‌ఫ్లూయెన్సర్లు, అక్కడికి వచ్చే ప్రజల తాకిడి తట్టుకోలేకపోయింది. ఎక్కడ చూసినా ఆమెను వెంబడించేవారే ఎక్కువయ్యారు.
తన బిజినెస్ చేసుకోనివ్వకుండా ఫోటోలు, వీడియోలు అంటూ తీవ్రంగా విసిగించడం మొదలుపెట్టారు. నిన్న కొందరు దుండగులు వెంటపడి ఇబ్బందిపెట్టడంతో ఆమె ఇండోర్ వెళ్లిపోయింది. పూసల దండలు అమ్మేందుకే ఇక్కడకు వచ్చానని, తన వల్ల మహా కుంభమేళా డిస్టర్బ్ అవుతోందని ఆమె ఓ వీడియోను పోస్ట్ చేసింది. తన వల్ల తన కుటుంబం ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఊరికి వెళ్లిపోతున్నా అంటూ ఆమె వీడియోలో చెప్పుకొచ్చింది.
महाकुंभ की वायरल गर्ल मोनालिसा की फैंस ने बढ़ाई मुसीबत, छोड़ा काम, वीडियो शेयर की दी जानकारी#MahaKumbh2025 #Mahakumbh #Monalisa #monalisabhosle #monalisakumbh #viralvideo pic.twitter.com/p6C2VhQi9W
— Panchdoot (@Panchdoot1) January 24, 2025
मुझे महाकुंभ में बहुत परेशान किया जा रहा है।।
लोग मैरे पीछे लगे है
परेशान होकर में बिल्कुल थक चुकी हुं
लोगो से निवेदन है कि मुझे परेशान ना करे #monalisa #मोनालिसा #मोनालिसा_प्रयागराज_संगम #monalisa #Prayagraj #PrayagrajMahakumbh2025 #PrayagrajMahakumbh #trading pic.twitter.com/o39KvMVWdX— Monalisa Bhosle (@MonalisaBhoslee) January 20, 2025