Viral : జార్ఖండ్ లో ఇంజిన్ లేకుండానే కదిలిన ట్రైన్..ఆశ్చర్యంలో ప్రజలు
ఇంజిన్ లేకుండా ఉన్న నాల్గు బోగోలు ఒక్కసారిగా కదిలాయి. రైలు ఏదో వెనకుకు పరిగెడుతున్నట్లు వేగంగా కదిలాయి
- By Sudheer Published Date - 01:00 PM, Wed - 6 September 23

ఇంజిన్ లేకుండా రైల్ (Train) అనేది కదలదనే సంగతి తెలిసిందే. కొన్ని సార్లు ఇంజన్ నుండి విడిపోయి కొంతదూరం రైలు భోగీలు అనేవి పరుగులు పెడుతుంటాయి. అది వేరే సంగతి. కానీ ఇక్కడ ఇంజన్ లేకుండా రైలు ముందుకు వెళ్లడం అందర్నీ ఆశ్చర్యాన్ని , షాక్ కు గురి చేసింది. ఈ ఘటన జార్ఖండ్ (Jharkhand)సాహిబ్‌గంజ్ జిల్లాలోని మాల్దా రైల్వే డివిజన్ (Malda Railway Division) పరిధిలో జరిగింది. మాములుగా ఇక్కడ గూడ్స్ రైళ్లు (Goods trains) సరుకులు లోడింగ్, అన్‌లోడింగ్ జరుగుతుంటాయి.
అయితే అక్కడ ఇంజిన్ లేకుండా ఉన్న నాల్గు బోగోలు ఒక్కసారిగా కదిలాయి. రైలు ఏదో వెనకుకు పరిగెడుతున్నట్లు వేగంగా కదిలాయి. బార్హర్వా రైల్వే స్టేషన్ చేరుకున్న తరువాత అవి కదలడం ఆగిపోయాయి. ఇది చూసిన స్థానికులు ఆశ్చర్యంతో దాని వెనుక పరుగులు పెట్టారు. అధికారులు కూడా దీనిని చూసి షాక్ అయ్యారు. ఆ విషయాన్ని ఉన్నతాధికారులు (Superiors) దృష్టికి తీసుకెళ్లారు. అదేలా సాధ్యం అవుతుంది..రైలు బోగోలు వాటంతటకవే ఎలా కదిలాయి..? అసలు అంత దూరం ఎలా వెళ్లాయి..? అనే కోణంలో విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు(Netizens) రకరకాలుగా స్పందిస్తున్నారు.
https://twitter.com/UtkarshSingh_/status/1698401467638620647?s=20