Rape : బాలిక మృతదేహాన్ని కూడా వదలని కామాంధులు..అసలు వీళ్లు మనుషులా..రాక్షసులా..?
Rape : తమ కామ కోరిక తీర్చుకునేందుకు బ్రతికున్న , చనిపోయిన సంబంధం లేదు అన్నట్లు ప్రవర్తించి..సభ్య సమాజం ఛీ కొట్టెలే వ్యవహరించిన ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని రాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది
- By Sudheer Published Date - 12:41 PM, Tue - 15 October 24

బ్రతికి ఉన్నవారిపైనే కాదు చనిపోయి..సమాధిలో ఉన్న ఆడవారిని సైతం వదలడం లేదు కామాంధులు. తమ కామ కోరిక తీర్చుకునేందుకు బ్రతికున్న , చనిపోయిన సంబంధం లేదు అన్నట్లు ప్రవర్తించి..సభ్య సమాజం ఛీ కొట్టెలే వ్యవహరించిన ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని రాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మహిళలపై , అభం శుభం తెలియని చిన్నారులపై ప్రతి రోజు పదుల సంఖ్యలో అఘాత్యాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
దేశ వ్యాప్తంగా మహిళలకే కాదు.. అభంశుభం తెలియని చిన్నారులకు సైతం రక్షణ అనేది కరువైంది. అర్ధరాత్రి పూట ఒంటరిగా మహిళ వచ్చినప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్టు అని మహానుభావులు అన్నారు. కానీ ఇప్పుడు పట్టపగలే నడిరోడ్డు పై ఒంటరిగా నడవలేని పరిస్థితి వచ్చింది. రోడ్ మీదే కాదు ఇంట్లో కూడా ఉండలేని స్థితికి కామాంధులు తీసుకొచ్చారు. ఒంటరి మహిళా కనిపిస్తే చాలు వయసు తో సంబంధం లేకుండా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ఇప్పటివరకు బ్రతికున్న వారిపైనే ఎక్కువగా దాడులు జరిగిన ఘటనలు వెలుగులోకి రాగా..తాజాగా సమాధిలో ఉన్న బాలిక మృతదేహాన్ని బయటకు తీసి ఆపై అత్యాచారం చేసిన ఘటన జార్ఖండ్ లో వెలుగులోకి వచ్చింది.
రాజ్‌గంజ్ ప్రాంతంలోని శ్మశానవాటికలో బాలిక మృతదేహాన్ని ఖననం చేయగా..ఇద్దరు బాలురు మృతదేహాన్ని సమాధి నుంచి బయటకు తీసి అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే ముస్లిం వర్గాలకు చెందిన ప్రజలు కోపంతో వీరంగం సృష్టించడం ప్రారంభించారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే రాజ్‌గంజ్ పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై విచారణ ప్రారంభించారు. కాగా ఇద్దరు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప తమ ఆగ్రహం ఆగదని నిరసనకారులు తెలపగా.. పోలీసులు అందరినీ శాంతింపజేసి ఇంటికి పంపించారు. ఈ ఘటన పట్ల యావత్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఛీ కొడుతున్నారు.
Read Also : AP Liquor Shop Lottery : ఆంధ్రప్రదేశ్ లో ముగిసిన మద్యం దుకాణాల లాటరి ప్రక్రియ!