Pilot: బారియర్ గేట్ తెరుచుకోలేదని గొడ్డలితో విరగొట్టిన వైనం.. వీడియో వైరల్?
ఈ మధ్య కాలంలో చాలామంది ఎయిర్ పోర్ట్ లలో, విమానంలో వింత వింతగా ప్రవర్తిస్తూ సోషల్ మీడియాలో నిలుస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక వ్యక్తి లో ప
- Author : Anshu
Date : 21-08-2023 - 3:17 IST
Published By : Hashtagu Telugu Desk
ఈ మధ్య కాలంలో చాలామంది ఎయిర్ పోర్ట్ లలో, విమానంలో వింత వింతగా ప్రవర్తిస్తూ సోషల్ మీడియాలో నిలుస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక వ్యక్తి లో ప్రయాణిస్తున్న విమానం తలుపులు తెరిచే ప్రయత్నం సిబ్బంది అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై కూడా విరుచుకుపడుతూ ఆ డోర్ తెరిచే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అతనిని ఎయిర్ పోర్ట్ సిబ్బందికి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కూడా ఒక వ్యక్తి అలాగే ప్రవర్తించాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే..
యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఒక పైలట్ ఎంప్లాయ్ పార్కింగ్ స్థలంలో ఉన్న బారియర్ గేట్ ను గొడ్డలితో విరగ్గొట్టారు. ఈ ఘటన అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం చోటు చేసుకుంది. ఎయిర్ పోర్ట్ ఎంప్లాయ్ పార్కింగ్ స్థలంలో మూడు ఎగ్జిట్ పాయింట్ ల వద్ద ఆరు కార్లు ముందుకు వెళ్లేందుకు వేచి చూస్తున్నాయి. అదే సమయంలో బారియర్ గేట్ తెరుచుకోలేదు. అయితే దాన్ని గమనించిన కెన్నెత్ హెండర్సన్ జోన్స్ అనే 63 ఏళ్ల పైలట్ తన వద్ద ఉన్న గొడ్డలితో గేటును విరగ్గొట్టాడు. అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా వెంటనే ఎయిర్పోర్ట్ ఉద్యోగి ఒకరు అతడిని అడ్డుకున్నాడు.
Apparently this United Airlines pilot was having a bad day at Denver International Airport 👀 pic.twitter.com/uY3yHwSKaQ
— Thenewarea51 (@thenewarea51) August 18, 2023
దీంతో వీరి మధ్య చిన్న ఘర్షణ కూడా చోటు చేసుకొంది. మరో ఉద్యోగి పోలీసులకు సమాచారం అందిచడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. పైలట్ చర్య కారణంగా 700 డాలర్ల అనగా ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.58 వేలకు పైగా నష్టం జరిగిందని అధికారులు వెల్లడించారు. పైలట్ సెప్టెంబరు 25న ఆడమ్స్ కౌంటీ కోర్టులో విచారణకు హాజరు కావాల్సి ఉంది.