Bull Dog Ant: ఈ చీమ చాలా డేంజర్.. కుడితే మనిషి ప్రాణాలు పోవాల్సిందే?
మామూలుగా ప్రతి ఒక్కరి ఇండ్లలో చీమలు ఉండడం అన్నది సహజం. అయితే చీమల్లో చిన్న చీమలు పెద్ద చీమలు కూడా ఉంటాయి. చీమలు కుడితే వాపు, దురద
- By Nakshatra Published Date - 04:35 PM, Wed - 6 September 23
మామూలుగా ప్రతి ఒక్కరి ఇండ్లలో చీమలు ఉండడం అన్నది సహజం. అయితే చీమల్లో చిన్న చీమలు పెద్ద చీమలు కూడా ఉంటాయి. చీమలు కుడితే వాపు, దురద, మంట రావడం అన్నది సహజం. చీమల్లో కొన్ని రకాల చీమలు కుడితే ఆ నొప్పి భరించలేని విధంగా ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు నొప్పి భరించలేక ప్రాణాలు కూడా పోవచ్చు. అదేంటి చీమలు కుడితే ప్రాణాలు పోతాయా అని ఆశ్చర్యపోతున్నారా! ఇప్పుడు మనం తెలుసుకోబోయే చీమలు కుడితే ప్రాణాలు క్షణాల్లోనే పోతుందట. మీరు విన్నది అక్షరాల నిజం అలాంటి చీమలు కూడా కొన్ని ఉన్నాయి.
భూప్రపంచంలో కెల్లా అత్యంత ప్రమాదకరమైన చీమ శాస్త్రీయ నామం బుల్ డాగ్ యాంట్ అంటారు. ఇది ఎక్కువగా ఆస్ట్రేలియా తీర ప్రాంతంలో కనిపిస్తుంది.1936 నుండి ఈ చీమ కాటు కారణంగా చాలా మంది మరణించారు. ఈ చీమ 20 మిమీ పొడవు ఉంటుంది. ఈ చీమ దాడి చేయడాని కి దాని స్టింగర్, దవడలను ఉపయోగిస్తుంది. ఈ చీమ కొరికిన కొన్ని నిమిషాల్లో దాని విషం మనిషి ప్రాణాలను తీస్తుంది. ఈ చీమల వల్ల 1988 వరకు చనిపోయారు. అదే చివరి మరణం కూడా. ఈ చీమల శరీర పొడవు 20 మిమీ, బరువు 0.015 గ్రాములు. దీని జీవితకాలం 21 రోజులు మాత్రమే.
ఈ ప్రమాదకరమైన చీమలు 1793లో కనుగొనబడ్డాయి. వాటి గూళ్ళు ఎక్కువగా మట్టిలో కనిపిస్తాయి, కానీ అవి కుళ్ళిన చెక్క, రాళ్ల అడుగున కూడా కనిపిస్తాయి. ఈ జాతి చీమలు భూమిలో నివాసం ఉండలేవు. కొన్ని తెగల వాళ్లు పెళ్లిళ్లు కావాలంటే వీటితో కుట్టించుకోవాలనే ఆచారం కూడా ఆ దేశాల్లో ఉంది. ఇలాంటి ఆచారాలు మన దేశం లో లేవు. లేకుంటే సగం మందికి పై బ్రహ్మచారులుగా ఉండేవారు.
Related News
IND vs ENG: భారత్ vs ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ అంత ఈజీ కాదా?
అఫ్గానిస్థాన్తో మూడు టీ20ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా అసలు సిసలు సమరానికి సిద్దమైంది. జనవరి 25 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. హైదరాబాద్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది.