Video Viral: పెళ్లిలో బ్లాక్ డ్రెస్సులతో అలాంటి పని చేసిన యువతులు.. వీడియో వైరల్?
సోషల్ మీడియాలో ఎక్కువగా పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా వధువు వరులకు సర్ప్రైజ్
- By Anshu Published Date - 04:35 PM, Tue - 5 September 23

సోషల్ మీడియాలో ఎక్కువగా పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా వధువు వరులకు సర్ప్రైజ్ ఇచ్చే విధంగా వారి ఫ్రెండ్స్ డాన్సులు చేయడం గిఫ్టులు ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇంకొందరు వధువు వరులు వారి ఫ్రెండ్స్ తో కలిసి జ్ఞాపకం గా ఉండాలి అని డ్యాన్సులు కూడా చేస్తూ ఉంటారు. ఆ పెళ్లి మూమెంట్లు ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోవాలని చాలా స్పెషల్ గా ప్లాన్లు చేస్తూ ఉంటారు.
తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్నేహితురాల్ని సర్‌ప్రైజ్ చేస్తూ ప్రత్యేక దుస్తుల్లో చిందులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వధువు స్నేహితులు పెళ్లికి వెళ్లారు. ఆమెను సర్‌ప్రైజ్ చేయడానికి ప్రత్యేకమైన డ్యాన్సులు చేశారు. ప్రత్యేకమైన విషధారణతో వేడుకకు హాజరైన బంధుమిత్రులను ఆశ్చర్యానికి గురిచేశారు. నల్లని డ్రెస్ వేసుకున్న అమ్మాయిలు, తెల్లని దుస్తులు ధరించిన అబ్బాయిలు కలిసి డ్యాన్సులతో అబ్బురపరిచారు. వేదికమీదకు ఎక్కి ఉత్తరకొరియాకు చెందిన పింక్ వీనోమ్ సాంగ్‌ని ప్లే చేశారు.
ఆ ట్యూన్‌కు దగ్గట్టుగా మెలికలు తిరుగుతూ చిందులు వేశారు. ఆ డ్యాన్సును వరునికి డిడికేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. సదరు వధువు స్నేహితుల డ్యాన్సులు చూసిన నెటిజన్లు అద్భుతం అంటూ కామెంట్లు చేస్తున్నారు. స్నేహితుల డ్యాన్స్ చూసిన ఆ వధువు కూడా సంతోషంతో గంతులేసినంత పని చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.