Creative Haircut : బుజ్జి పెట్టెలో బుడ్డోడికి హెయిర్ కట్
Creative Haircut : పసి పిల్లలకు హెయిర్ కట్ చేయడం అనేది.. ప్రపంచంలో అతి కష్టమైన పనుల్లో ఒకటి !! ఈ మహిళ ఒక గడుగ్గాయికి చాలా ఈజీగా హెయిర్ కట్ చేసింది..
- By Pasha Published Date - 12:02 PM, Fri - 30 June 23

Creative Haircut : పసి పిల్లలకు హెయిర్ కట్ చేయడం అనేది.. ప్రపంచంలో అతి కష్టమైన పనుల్లో ఒకటి !!
పిల్లల్ని కంట్రోల్ లోకి తెచ్చుకొని వారికి హెయిర్ కట్ చేయడం పెద్ద సవాల్.
కానీ ఈ మహిళ ఒక గడుగ్గాయికి చాలా ఈజీగా హెయిర్ కట్ చేసింది..
దీనికి సంబంధించిన వీడియో ఒకటి ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.. మీరు కూడా ఈ వీడియోపై ఒక లుక్ వేయండి.
#HairCut ♥️🩷
🤣🤣🤣🤣🤣 pic.twitter.com/dMgfFIORRm
— Rupin Sharma IPS (@rupin1992) June 29, 2023
హెయిర్ కట్ చేసుకునేందుకు మారాం చేస్తున్న బుడ్డోడిని ఈ మహిళ ఒక అట్ట పెట్టెలో కూర్చోబెట్టింది. ఈ పెట్టెను కింది నుంచి ఓపెన్ ఉంచింది. కింది భాగం నుంచి పిల్లోడు కాళ్ళను బయటకు వదిలి కూర్చున్నాడు. బాక్స్ లో పిల్లోడి మెడ చుట్టూ ఉన్న భాగాన్ని టేపుతో మహిళ సీల్ చేసింది. ఆ వెంటనే ఆమె హెయిర్ ట్రిమ్మర్ ను తీసుకొని పిల్లవాడి జుట్టును చకచకా ట్రిమ్(Creative Haircut) చేసింది. అట్ట పెట్టె లోపల ఆ పసికందు చేతులు ఉండటం వల్ల హెయిర్ కట్ ను అతడు అడ్డుకోలేకపోయాడు. ఈ వీడియోను మొదట టిక్‌టాక్‌లో షేర్ చేశారు. దాన్ని ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీనిపై నెటిజన్స్ పెద్దఎత్తున కామెంట్స్ చేశారు. ఆమె క్రియేటివిటీని పొగిడారు. భవిష్యత్తు కోసం ఇలాంటి అద్భుతమైన ఆలోచనలను అందించినందుకు ఐపీఎస్ అధికారికి నెటిజన్స్ కృతజ్ఞతలు తెలిపారు.