Zinc Man : బాడీకి జింక్ అందించేందుకు నాణేలు, అయస్కాంతాలను మింగేశాడు.. ఏమైందంటే ?
Zinc Man : జింక్ శరీర నిర్మాణానికి సహాయపడుతుందని అతడు నమ్మాడు. ఇందులో తప్పేం లేదు.
- By Pasha Published Date - 11:15 AM, Tue - 27 February 24
![Zinc Man : బాడీకి జింక్ అందించేందుకు నాణేలు, అయస్కాంతాలను మింగేశాడు.. ఏమైందంటే ?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/02/Zinc-Man.jpg)
Zinc Man : జింక్ శరీర నిర్మాణానికి సహాయపడుతుందని అతడు నమ్మాడు. ఇందులో తప్పేం లేదు. కానీ ఏ రూపంలోనైనా జింక్‌ను శరీరంలోకి తీసుకోవచ్చని భావించడం దగ్గరే అతగాడు పెద్ద తప్పు చేశాడు. బాడీలో జింక్ మోతాదును పెంచు కునేందుకు నాణేలు, అయస్కాంతాలను మింగడం మొదలుపెట్టాడు ఢిల్లీకి చెందిన 26 ఏళ్ల యువకుడు. దీంతో గత 20 రోజులుగా అతడికి తీవ్ర కడుపునొప్పి, వాంతులు వస్తున్నాయి. ఏమీ తినలేకపోయాడు. దీంతో చివరకు అతడిని ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. ఈ రోగికి మొదట ఔట్ పేషెంట్ విభాగంలో సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ తరుణ్ మిట్టల్ చెక్ చేశారు. గత కొన్ని వారాలుగా ఆ యువకుడు నాణేలు, అయస్కాంతాలు తిన్నాడని రోగి బంధువులు డాక్టర్‌కు వివరించారు. మానసిక సమస్యల వల్ల ఇలా చేశాడని తెలిపారు. దీంతో ఆ యువకుడికి (Zinc Man) ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి పేగుల నుంచి 39 నాణేలు, 37 అయస్కాంతాలను బయటకు తీశారు.
We’re now on WhatsApp. Click to Join
అంతకుముందు ఆ యువకుడి పొత్తి కడుపు, పేగు భాగాలను ఎక్స్ రే, సీటీ స్కాన్లు తీయగా.. వాటిలోనూ నాణేల ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయి. దీంతో అతడిని వెంటనే శస్త్రచికిత్సకు సిద్ధం చేశారు. చిన్న ప్రేగులలోకి అయస్కాంతాలు, నాణేలు చొరబడ్డాయని గుర్తించారు. దీంతో పేగులు తెరిచి నాణేలు, అయస్కాంతాలను బయటకు తీయాల్సి వచ్చింది. కడుపులో నుంచి మొత్తం 39 నాణేలు (రూ. 1, 2, 5 నాణేలు), 37 అయస్కాంతాలు (గుండె, గోళాకారం, నక్షత్రం, బుల్లెట్, త్రిభుజం ఆకారాలు) బయటికి తీశారు.
Also Read : UKs First Lady : ఇదీ సింప్లిసిటీ.. ఫ్యామిలీతో బ్రిటన్ ప్రథమ మహిళ
జింక్ లోపం తలెత్తకుండా ఉండాలంటే..
- మనిషి శరీరంలో జింక్ లోపం తలెత్తకుండా ఉండాలంటే హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలి. ముఖ్యంగా జింక్ అధికంగా ఉండే పదార్ధాలను డైట్లో ఉండేట్టు చూసుకోవాలి.
- ఆనపకాయ విత్తనాలు తినడం వల్ల జింక్ లోపం సరిచేయవచ్చు. ఇందులో జింక్‌తో పాటు ఫైబర్, ప్రోటీన్లు, న్యూట్రిషన్లు ఉంటాయి.
- 100 గ్రాముల ఆనపకాయ విత్తనాల్లో దాదాపుగా 7.64 గ్రాముల జింక్ ఉంటుంది. జింక్ పుష్కలంగా ఉండే మరో ఆహారం పాలకూర. ప్రతి 100 గ్రాముల పాలకూరలో 0.79 గ్రాముల జింక్ ఉంటుంది.
- జింక్ లోపమున్నప్పుడు పాలకూర, ఆనపకాయ విత్తనాలు సరైన ప్రత్యామ్నాయాలుగా చెప్పవచ్చు. ఈ రెంటితో పాటు మటన్, పెరుగులో కూడా జింక్ కావల్సినంత లభిస్తుంది.
- వారంలో రెండుసార్లు మటర్ తినడం మంచి అలవాటుగా చెబుతారు. శరీరానికి అవసరమైన ఎనర్జీ కూడా లభిస్తుంది. శాకాహారులైతే మటన్ స్థానంలో జీడిపప్పు, శెనగలు డైట్లో చేర్చుకోవాలి.
- పెరుగు తప్పనిసరిగా డైట్లో ఉండాలి. 100 గ్రాముల పెరుగులో 1.03 మిల్లీగ్రాముల జింక్ ఉంటుంది. జీర్ణ సంబంధ సమస్యలు కూడా దూరమౌతాయి. మెటబోలిజం వేగవంతమౌతుంది.
- సీ ఫుడ్ కూడా జింక్ లోపాన్ని సరిచేసేందుకు మరో ప్రత్యామ్నాయం. ఆయిస్టర్ వంటి చేపల్లో ఎక్కువ మోతాదులో జింక్ ఉంటుంది. 1 గ్రాము చేపలోనే 78.6 మిల్లీగ్రాముల జింక్ లభిస్తుంది. దాంతోపాటు ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది.
Also Read :RBI Penalty: మరో మూడు బ్యాంకులకు షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. భారీగా జరిమానా..!
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)