Youtube New Rules : ఇకపై ఎలాపడితే ఆలా వీడియోస్ అప్లోడ్ చేస్తే అంతే సంగతి !!
Youtube New Rules : క్రియేటర్లు తప్పనిసరిగా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను అనుసరించాల్సి ఉంటుంది. ఒరిజినల్, క్రియేటివ్ కంటెంట్‌ను మాత్రమే ప్రోత్సహిస్తామని యూట్యూబ్ స్పష్టం చేసింది
- By Sudheer Published Date - 07:57 PM, Wed - 9 July 25

యూట్యూబ్ (Youtube ) కేవలం వినోదాన్ని పంచడమే కాదు లక్షల అందించే యంత్రం అయ్యింది. ప్రస్తుతం యూట్యూబ్ ద్వారా నెలకు లక్షలు సంపాదించే వారు ఎంతో మంది ఉన్నారు. ప్రతి రోజు లక్షల మంది ఛానల్ ఓపెన్ చేసి తమ టాలెంట్ ను చూపిస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. అయితే తాజాగా యూట్యూబ్ సరికొత్త రూల్స్ ను ఈ నెల 15 నుండి స్టార్ట్ చేయబోతుంది. దీనివల్ల యూట్యూబ్ లో ఆదాయం పొందాలనుకునే కంటెంట్ క్రియేటర్లు ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఒరిజినల్ కంటెంట్‌ను ప్రోత్సహించేందుకు, మళ్లీ మళ్లీ వాడే వీడియోల (Reused Content)పై యూట్యూబ్ కఠినంగా వ్యవహరించనుంది.
కొత్త మార్గదర్శకాల్లో ప్రకారం.. ఇతరుల వీడియోలను కట్ చేసి, మిక్స్ చేసి, కేవలం టెక్స్ట్ లేదా వాయిస్ ఓవర్ మాత్రమే జోడించి అప్‌లోడ్ చేయడం, కాపీ పేస్ట్ విధానంలో కంటెంట్ సృష్టించడం, AI టూల్స్ ద్వారా రూపొందించిన తక్కువ ఒరిజినాలిటీ గల వీడియోలు ఇవన్నీ యూట్యూబ్ పాలసీలకు వ్యతిరేకంగా పరిగణించబడతాయి. అలాంటి ఛానళ్లపై డీమానిటైజేషన్ వంటి చర్యలు తీసుకుంటామని యూట్యూబ్ స్పష్టం చేసింది.
క్రియేటర్లు తప్పనిసరిగా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను అనుసరించాల్సి ఉంటుంది. ఒరిజినల్, క్రియేటివ్ కంటెంట్‌ను మాత్రమే ప్రోత్సహిస్తామని యూట్యూబ్ స్పష్టం చేసింది. ఇది యూట్యూబ్ లో నాణ్యమైన కంటెంట్ వృద్ధికి దోహదపడుతుందని పేర్కొంది. కనుక, వచ్చే రోజులలో యూట్యూబ్ ద్వారా ఆదాయం పొందాలనుకునే వారు తమ కంటెంట్‌లో స్వంతతను ప్రదర్శిస్తూ, వినూత్నంగా ప్రజలకు ఉపయోగపడే విషయాలను అందించాలి. లేకపోతే ఛానల్ డీమానిటైజ్ అయ్యే ప్రమాదం తప్పదు.