Ayodhya – Sitaram : అయోధ్యలో సీతాసమేతంగా రాముడిని ఎందుకు ప్రతిష్ఠించలేదు? చాగంటి వివరణ ఇదీ
Ayodhya - Sitaram : భద్రాచలం, ఒంటిమిట్టలోని రామమందిరాల్లో సీతా, లక్ష్మణ సమేత రాముడి విగ్రహాలు ఉన్నాయి.
- By Pasha Published Date - 03:57 PM, Wed - 24 January 24

Ayodhya – Sitaram : భద్రాచలం, ఒంటిమిట్టలోని రామమందిరాల్లో సీతా, లక్ష్మణ సమేత రాముడి విగ్రహాలు ఉన్నాయి. కానీ అయోధ్యలోని రామమందిరం గర్భగుడిలో బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇలా ఎందుకు చేశారు ? అనే ప్రశ్న చాలామంది మదిలో మెదులుతోంది. రామ్ లల్లా విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన అరుణ్ యోగి రాజ్ అనే శిల్పి చెక్కారు. సీతారామ లక్ష్మణ హనుమంతుడి విగ్రహాలతో ఉన్న అరుణ్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో చాలామంది సీతా, లక్ష్మణ సమేత రాముడి విగ్రహాలను అయోధ్యలో ప్రతిష్ఠిస్తారని భావించారు. కానీ అలా జరగలేదు. కేవలం బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దీనిపై ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు(Ayodhya – Sitaram) ట్విట్టర్ వేదికగా ఒక పోస్టు పెట్టారు. ఈ అంశంపై ఆయన విశ్లేషణ చేశారు.
https://twitter.com/ShriChaganti/status/1749992499685572878?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1749992499685572878%7Ctwgr%5Eac3895b4f44216382a9f815258c124de25d1e746%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Flatest-news%2Findia-news%2Fwhy-is-ram-idol-only-placed-in-ayodhya-mandir-and-not-sita-maa%2Farticleshow%2F107107542.cms
We’re now on WhatsApp. Click to Join.
చాగంటి కోటేశ్వర రావు ఏమన్నారంటే..
చాగంటి కోటేశ్వర రావు విశ్లేషణ ఇదీ.. ‘‘అయోధ్యలో బాలరాముల వారిని ఎందుకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. సీతారాముల వారిని ఎందుకు ప్రతిష్ఠించలేదు అని చాలా మంది అడుగుతున్నారు. దీనికి జవాబు ఏమిటంటే.. సముద్రగుప్తుడు, విక్రమాదిత్య కాలం 1076 – 1126 CE కు ముందు నుంచే అయోధ్యలో రామాలయం ఉంది. అప్పుడే రామ్ లల్లా పేరుతో 5 నుంచి 6 అంగుళాల బాల రాముడి మూర్తి ఉండేది. కాల క్రమేణా గుడి ఆక్రమణలు జరిగినా, తరువాత కాలంలో అక్కడే అయోధ్యలో తవ్వకాలు జరిపితే అదే బాల రాముడి మూర్తి బయటపడింది. అంటే దాని అర్దం, ఇది మన చరిత్ర కదా..! మనం మళ్ళీ అదే స్థలంలో రాముల వారి కోసం ఆలయాన్ని తిరిగి నిర్మిస్తున్నాం కదా.. అప్పుడు ఎవరికి ప్రాణ ప్రతిష్ఠ చేయాలి.. మన చరిత్రను పరిగణనలోకి తీసుకొని అదే బాల రాముల వారికే కదా ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. అందుకే బాల రాముల వారి వయసు 5-8 సంవత్సరాలు ఉండే మూర్తిని చెక్కారు’’ అని తెలిపారు. ‘‘అయోధ్యలో రామాలయం మొదటి అంతస్తులో గర్భగుడిలో బాల రాముడు ఉన్నాడు. ఇంకా 2 అంతస్తులు ఉన్నాయి కదా.. గుడి పూర్తిగా నిర్మాణం అయ్యాక సీత రామ లక్ష్మణ హనుమ స్వామితో సహా విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. అలాగే మాత కౌసల్య దేవికి కూడా ఆలయంలో పూజలు చేస్తారు’’ అని ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వర రావు వివరణ ఇచ్చారు.