Pits On Moon-WHY : అందాల చందమామపై లక్షల గుంతలు.. ఎందుకు ?
Pits On Moon-WHY : ఒకరి అందాన్ని పొగడడానికి చందమామను మించిన పోలిక మరొకటి ఉండదు..
- By Pasha Published Date - 07:36 AM, Wed - 9 August 23

Pits On Moon-WHY : ఒకరి అందాన్ని పొగడడానికి చందమామను మించిన పోలిక మరొకటి ఉండదు..
చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ ఆగస్టు 5న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు పంపిన వీడియోను చూస్తే చందమామపై వేలాదిగా గుంతలు కనిపిస్తాయి.
ఇంతకీ చంద్రునిపై ఇన్ని గుంతలు ఎందుకు ఉన్నాయి?
ఇవి ఎలా ఏర్పడ్డాయి ? ఎందుకు ఏర్పడ్డాయి ?
చందమామపై ఉన్న వేలాది గుంతల గురించి తెలుసుకోవాలంటే మనం దాదాపు 450 కోట్ల సంవత్సరాల కిందటికి వెళ్లాలి. అప్పట్లో అంతరిక్షం నుంచి రాళ్లు, ఉల్కల వర్షం చంద్రుడిపై కురిసిందని అంటారు. ఆ రాళ్లు, ఉల్కల ధాటికి చంద్రుడి ఉపరితలంపై గుంతలు ఏర్పడ్డాయి. ఈవిధంగా చంద్రునిపై దాదాపు 14 లక్షల గుంతలు పడ్డాయి. అయితే ఇప్పటివరకు శాస్త్రవేత్తలు గుర్తించిన గుంతలు మాత్రం 9137 మాత్రమే. వీటిలో కొన్ని గుంతల వయసు ఏకంగా 1675 సంవత్సరాలు కూడా ఉందని తేలింది. ఇదంతా చంద్రుడికి ఒకవైపే.. మరోవైపును మనం చూడలేం. ఎందుకంటే చంద్రుడికి ఇంకోవైపు చిమ్మచీకటి ఉంటుంది. ఆ భాగాన్ని చూడటం కష్టం. అందుకే ఆ చీకటి భాగంలో ఎన్ని గుంతలు ఉన్నాయి ? ఏ సైజులలో ఉన్నాయి ? అనేది ఐడెంటిఫై చేయలేకపోయారు.
Also read : Nehru Independence Day Speech : మొట్టమొదటి ఆగస్టు 15 వేడుకల్లో చాచా నెహ్రూ ప్రసంగం ఇదిగో
40 కిలోల రాయి ఢీ.. చంద్రుడిపై 290 కి.మీ బిలం
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) 2013 మార్చి 17న చంద్రునిపై అతిపెద్ద బిలాన్ని గుర్తించింది. గంటకు 90 వేల కిలోమీటర్ల వేగంతో 40 కిలోల బండరాయి ఒకటి వచ్చి ఢీకొనడంతో 290 కి.మీ సైజులో పెద్ద గుంత (బిలం-క్రేటర్) చంద్రునిపై ఏర్పడిందని తేల్చారు. మీరు కూడా భూమి నుంచి దీన్ని చూడొచ్చు. టెలిస్కోప్ ద్వారా చూస్తే.. ఈ బిలం యొక్క అద్భుతమైన దృశ్యాన్ని వీక్షించవచ్చు.
Also read : Independence Day 2023: ఈ సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం థీమ్ ఏమిటి..? ఈ స్వాతంత్య్ర దినోత్సవం ఎన్నోది..?
https://twitter.com/chandrayaan_3/status/1688215948531015681?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1688215948531015681%7Ctwgr%5Eea17e448fea24b7ca7b13dc1103ec2ecb799d5e0%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.hashtagu.in%2Findia%2Ffirst-images-of-moon-as-captured-by-chandrayaan3-spacecraft-154192.html
భూమిపై గుంతలకు, చంద్రుడిపై గుంతలకు తేడా ?
మన భూమిపై గుంతలు ఏర్పడితే కొంతకాలంలోనే వాటిలోకి చుట్టుపక్కల నుంచి మట్టి చేరుతుంది. అందులో మొక్కలు పెరుగుతాయి. వానలకు నీళ్లు నిండుతాయి. కొంతకాలం తర్వాత ఆ గుంత పూడుతుంది. భూమిపై ఉండే మట్టికి ఉన్న ప్రత్యేక స్వభావం వల్ల ఇది సాధ్యమవుతోంది. కానీ చంద్రుడిపై పూర్తి విరుద్ధమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ నీరు లేదు. వాతావరణం లేదు. టెక్టోనిక్ ప్లేట్లు లేవు. అందుకే అక్కడ మట్టి వెదజల్లబడదు. గాలి వీయడం లేకపోవడంతో మట్టి ఎక్కడిది అక్కడే ఉంటుంది. కదిలే ఛాన్స్ ఉండదు. అందువల్ల చంద్రుడిపై కోట్ల ఏళ్ళ క్రితం ఏర్పడిన బిలాలు(Pits On Moon-WHY) ఇంకా చెక్కుచెదరకుండా అలాగే ఉన్నాయి. చంద్రునిపై ఉన్న చాలా గుంతల వయస్సు సగటున 20 కోట్ల సంవత్సరాలు. అంటే.. చంద్రుడు ఏర్పడినప్పుడు దానిపై గుంతలు లేవు. చంద్రుడు ఆవిర్భవించిన దాదాపు 250 ఏళ్ల తర్వాత గుంతలు ఏర్పడటం మొదలైందని అంటారు. చంద్రునిపై అతిపెద్ద బిలం దాని దక్షిణ ధ్రువానికి సమీపంలో ఉంది. దీన్ని దాటాలంటే చంద్రునిపై దాదాపు 290 కిలోమీటర్లు లోపలికి నడవాలి. చంద్రునిపై 1 కిలోమీటరు విస్తీర్ణం కలిగిన 13 లక్షల గుంతలు ఉన్నాయి. 5 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన 83 వేల గుంతలు ఉన్నాయి. 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన గుంతలు 6972 ఉన్నాయి.