Tall Trees: చెట్లు ఎల్లప్పుడూ 90 డిగ్రీల సరళ రేఖలో పెరగడానికి అసలు కారణం ఏంటో తెలుసా?
సాధారణంగా కొన్ని మొక్కలు నిటారుగా పెరుగుతూ ఉంటాయి. అలాంటివాటిలో హైపెరియన్ చెట్లు కూడా ఒకటి.
- Author : Anshu
Date : 15-06-2022 - 6:15 IST
Published By : Hashtagu Telugu Desk
సాధారణంగా కొన్ని మొక్కలు నిటారుగా పెరుగుతూ ఉంటాయి. అలాంటివాటిలో హైపెరియన్ చెట్లు కూడా ఒకటి. హైపెరియన్ చెట్లు ప్రపంచంలోనే ఎత్తైన చెట్ల లో ఒకటిగా చెప్పవచ్చు. వీటి పొడవు దాదాపుగా 379 అడుగులకు పైమాటే. ఈ చెట్లు 90 డిగ్రీల సరళరేఖలో పెరుగుతాయి. మరి ఈ చెట్లు ఎందుకు ఎప్పుడూ చాలా వేగంగా పెరుగుతాయి? ఇతర చెట్ల మాదిరిగా కొమ్మలు కొమ్మలుగా విడిపోవచ్చు కదా? అన్న ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. మరి చెట్లు ఎందుకు 90 డిగ్రీల సరళ రేఖలోనె పెరుగుతాయి దానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఏదైనా చుట్టూ 90 డిగ్రీలలో పెరగడానికి కారకాలు కారణమవుతాయి. ఇకపోతే మొక్క ఎదుగుదలకు మూడు అంశాలను ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అందులో ఒకటి కాంతి, రెండవది కార్బన్ డై ఆక్సైడ్, మూడవది నీరు. చెట్టు పొడవుల సూర్యకాంతి ముఖ్య పాత్ర పోషిస్తుంది. సూర్యకాంతి కారణంగా మొక్కల్లో ఉన్నప్పుడు క్లోరోఫిల్ ఏర్పడడానికి కారణం అవుతుంది. అయితే సూర్యకాంతి తగిలిన ప్రతి మొక్క కూడా పొడుగ్గా పెరగవు కొన్ని చెట్లు మాత్రమే 90 డిగ్రీల కోణంలో పెరుగుతూ ఉంటాయి. ప్రతి మొక్కకు కూడా దాని సొంత జన్యువు ఉంటుంది.
నిర్దిష్ట జన్యు జాతుల మొక్కలు ఒక ప్రత్యేక రికార్డులు సృష్టిస్తూ ఉంటాయి. అలాగే చుట్టుపక్కల వాతావరణం కూడా 90 డిగ్రీల నిటారుగా పెరుగుతున్నట్లు రికార్డు చేసే చెట్ల పైన ఆధారపడి ఉంటుంది. అలాగే కొన్ని ఎక్కువ వెలుతురు అవసరమయ్యే చెట్లు కూడా ఉన్నాయి. ఇంకొన్ని చెట్లు పక్కనే ఉన్న చెట్లు వల్ల వెలుతురు రాకపోవడంతో కాంతి కోసం పైకి కదులుతూ వెళ్తాయి.