WhatsApp Outage: నిలిచిపోయిన వాట్సాప్ సేవలు.. షాక్ లో యూజర్స్!
వాట్సాప్ యూజర్స్ కు బిగ్ షాక్.. గత కొన్ని గంటలుగా వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. మెటా యాజమాన్యంలోని ప్రముఖ ఇన్స్టంట్
- By Hashtag U Published Date - 01:16 PM, Tue - 25 October 22
వాట్సాప్ యూజర్స్ కు బిగ్ షాక్.. గత కొన్ని గంటలుగా వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. మెటా యాజమాన్యంలోని ప్రముఖ ఇన్స్టంట్ కమ్యూనికేషన్ యాప్ వాట్సాప్ పనిచేయకపోవడంతో యూజర్స్ లబోదిబోమంటున్నారు. మేసేజలు పంపలేక, రిసీవ్ చేసుకోలేక ఇబ్బంది పడ్తున్నారు. వ్యక్తిగత మేసేజ్లతో పాటు గ్రూప్ మెసేజింగ్ కూడా పనిచేయడం లేదని తెలుస్తోంది.
వేలకొద్దీ వినియోగదారుల వాట్సాప్ పని చేయడం లేదని అవుట్టేజ్ డిటెక్షన్ వెబ్సైట్ DownDetector కుడా క్లారిటీ ఇచ్చింది. సాంకేతిక సమస్యతో ముంబై, ఢిల్లీ, కోల్కతా, లక్నో, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలు సతమతమవుతున్నాయి . Whats APP కనెక్ట్ కాకపోవడంతో దేశవ్యాప్తంగా కొన్ని కీలకమైన సేవలు నిలిచిపోయాయి.
#UPDATE | "We're aware that some people are currently having trouble sending messages and we're working to restore WhatsApp for everyone as quickly as possible," Meta Company Spokesperson https://t.co/mcKecXLdVO
— ANI (@ANI) October 25, 2022
Related News
Thalapathy Vijay: వామ్మో.. విజయ్ దళపతికి అన్ని వందల వాట్సాప్ గ్రూపులు ఉన్నాయా!
కోలివుడ్ స్టార్ విజయ్ తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.