Pin Messages : వాట్సాప్ ఛాట్‌లో ఇక 3 మెసేజ్‌లను పిన్ చేయొచ్చు
Pin Messages : వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
- By Pasha Published Date - 09:17 AM, Sat - 30 March 24

Pin Messages : వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు వాట్సాప్ ఛాట్‌లను మనం పిన్ చేయొచ్చు. దీన్ని గ్రూప్ ఛాట్ లేదా ప్రైవేట్ ఛాట్ దేనికోసమైనా యూజర్లు వాడుకోవచ్చు. మల్టీపుల్ మెసేజెస్ ఉన్న వాట్సాప్ గ్రూపు ఉంటే.. దాన్ని కూడా పిన్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల వాట్సాప్‌ను ఓపెన్ చేసిన వెంటనే ఛాట్ ఇండెక్స్‌లో టాప్‌లో అవే కనిపిస్తాయి. ఒక మెసేజ్‌ను చాలా కాలం పాటు పిన్ చేయొచ్చు. ఈ ఫీచర్‌కు సంబంధించి మెటా(ఫేస్ బుక్) సీఈవో జుకర్ బర్గ్ ఇటీవలే తన వాట్సాప్ ఛానెల్‌లో ఒక స్క్రీన్ షాట్‌ను షేర్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join
ఇక ఆ అవసరం ఉండదు
సాధారణంగా ఏదైనా మెసెజ్ వస్తే దాన్ని చూసేందుకు కిందికి స్క్రోల్ చేయాల్సి వస్తుంది. అయితే ఈ పిన్ ఆప్షన్(Pin Messages) వల్ల ఆ అవసరం ఉండదు. పిన్ చేసిన ఛాట్ మెసేజెస్ టాప్‌లో ఉంటాయి. కచ్చితంగా మూడు మెసేజ్‌లను పిన్ చేసుకోవాలన్న రూలేం లేదు. ఒకటి లేదా రెండు ఛాట్ మెసేజ్‌లను కూడా పిన్ చేసుకోవచ్చు. ఈ మెసేజెస్‌కు అదనంగా ఫోటోలు, పోల్స్ రెండింటినీ పిన్ చేయొచ్చు. ఈ పిన్ చేసిన సందేశాలను 24 గంటలు, 7 రోజులు లేదా 30 రోజుల పాటు ఉంచొచ్చు. దీనికి టైమ్ పీరియడ్‌ను కూడా మీరే ఎంచుకోవచ్చు.
Also Read :AP DSC 2024 : ఏపీ డీఎస్సీ వాయిదా.. రివైజ్డ్ షెడ్యూలు ఎప్పుడు ?
ఇలా పిన్ చేయాలి
- ముందుగా ఛాట్ ఆప్షన్‌కి వెళ్లండి.
- మీరు పిన్ చేయాలనుకుంటున్న మెసేజ్‌పై ట్యాప్ చేయండి.
- More Optionsపై క్లిక్ చేసిన తర్వాత ‘Pin’ ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి.
- ఇకపై ఆ మెసేజ్.. ఛాట్ బాక్స్‌లో ఎగువ భాగాన కనిపిస్తుంది.
- గ్రూప్ అడ్మిన్లు ఇతర సభ్యుల మెసేజ్‌లను పిన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వొచ్చు.
- ఈ ఫీచర్ కేవలం గ్రూప్ అడ్మిన్లకు మాత్రమే పరిమితం కాలేదు.