HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >What Is Isis K The Group Claiming Responsibility For Russia Terror Attack

ISIS K : రష్యాలో 60 మందిని చంపిన ‘ఐసిస్-కే’.. ఏమిటిది ?

ISIS K : రష్యా రాజధాని మాస్కోలో ఉన్న క్రాకస్‌ సిటీ కన్సర్ట్‌ హాల్‌‌పై ఉగ్రదాడి చేసింది తామే అని ఐసిస్-కే (ISIS-K) ప్రకటించింది.

  • By Pasha Published Date - 08:29 AM, Sat - 23 March 24
  • daily-hunt
Isis K
Isis K

ISIS K : రష్యా రాజధాని మాస్కోలో ఉన్న క్రాకస్‌ సిటీ కన్సర్ట్‌ హాల్‌‌పై ఉగ్రదాడి చేసింది తామే అని ఐసిస్-కే (ISIS-K) ప్రకటించింది. ఈ దాడిలో  60 మంది మృతిచెందగా, 100 మందికిపైగా గాయపడ్డారు. ‘ఐసిస్-కే’ అంటే.. ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ !! ఇది ఐసిస్ ఉగ్ర సంస్థ ఆఫ్ఘన్ శాఖ !! రష్యాపై దాడి ‘ఐసిస్-కే’ ఉగ్ర సంస్థ పనే అని అమెరికాకు చెందిన ఆర్మీ ఇంటెలీజెన్స్ విభాగం తెలిపింది. ఇంతకీ ‘ఐసిస్-కే’ ఏమిటి ? ఎందుకీ దాడి చేసింది.. చూద్దాం..

We’re now on WhatsApp. Click to Join

‘ఇస్లామిక్ స్టేట్ – ఖొరాసన్’ (ISIS-K) ఉగ్రసంస్థ  ఇరాన్, తుర్క్‌మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లలోని సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది. ఈ మూడు దేశాల సరిహద్దు ప్రాంతాన్ని ఖొరాసన్ అని పిలుస్తుంటారు. ఇది 2014 చివర్లో తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉద్భవించింది.  ఇది క్రూరత్వానికి కేరాఫ్ అడ్రస్. 2018 సంవత్సరం నుంచి ISIS-Kలో ఉగ్రవాదుల చేరికలు తగ్గాయి. ఈ ఉగ్రసంస్థ వల్ల  ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్, అమెరికా దళాలు అప్పట్లో భారీ నష్టాలను చవిచూశాయి. 2021లోఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా ఆర్మీ వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో ఐఎస్‌ఐఎస్-కెకు అడ్డు లేకుండాపోయింది.

Also Read : 60 Killed : 60 మంది మృతి, 100 మందికి గాయాలు.. రష్యా రాజధాని మాస్కోపై ఉగ్రదాడి

  •  ఆఫ్ఘనిస్తాన్‌లో, ఇరుగుపొరుగు దేశాల్లో ఉగ్రదాడులు చేసిన చరిత్ర ఐసిస్-కేకు ఉంది.
  • ఈ సంవత్సరం ప్రారంభంలో ఇరాన్‌లో దాదాపు 100 మందిని చంపిన జంట బాంబు పేలుళ్ల వెనుక ఐసిస్-కే ఉందని అనుమానిస్తున్నారు.
  • 2022సెప్టెంబర్‌‌లో  కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయం వద్ద జరిగిన ఆత్మాహుతి దాడికి ISIS-K తీవ్రవాదులతో లింక్ ఉంది.
  • 2021లో కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడికి కూడా ISIS-K  బాధ్యత వహించింది. ఈ దాడిలో 13 మంది అమెరికా సైనికులు, అనేక మంది పౌరులు మరణించారు.

Also Read : Trump Link : మాస్కో ఉగ్రదాడి.. తెరపైకి ట్రంప్ పేరు.. ఎందుకు ?

ఇటీవల కాలంలో ఐసిస్-కే  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై వ్యతిరేకతను పెంచుకుంది. తరుచూ పుతిన్‌ను విమర్శిస్తూ.. అది ప్రకటనలను విడుదల చేస్తోంది. ముస్లింలను అణచివేసే అంతర్జాతీయ కార్యకలాపాలలో రష్యా భాగస్వామిగా ఉందని ఐసిస్-కే అంటోంది.  ఆసియా ప్రాంతానికి చెందిన ఎంతోమంది ఐసిస్-కేలో ఉన్నారని అమెరికాకు చెందిన రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఐసిస్-కే రష్యా వ్యతిరేక వైఖరిని తీసుకుందంటే.. అమెరికాను సపోర్ట్ చేస్తోందా ? అమెరికా నుంచి సపోర్టు తీసుకుంటోందా ? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

Also Read : Vundavalli Sridevi : ఉండవల్లి శ్రీదేవికి బాబు వెన్నుపోటు..?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ISIS K
  • Russia Terror Attack
  • Terror Group

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd