Hostel Girl: స్నానం చేస్తూ బాత్రూంలో పాటలు వినకూడదా? హాస్టల్ రూల్స్ పై నెటిజన్స్ ట్రోల్స్!
హాస్టల్ బాత్ రూంలో పాటలు విన్నందుకుగానూ ఓ అమ్మాయి స్వారీ లెటర్ రాయడం హాట్ టాపిక్ గా మారింది.
- Author : Balu J
Date : 10-06-2023 - 4:59 IST
Published By : Hashtagu Telugu Desk
హాస్టల్ (Hostel) లైఫ్ అంటేనే స్నేహితులతో అల్లర్లు, క్యాంటీన్ కబుర్లు.. సినిమాలు, షికార్లు లాంటివీ సహజం. లేడీస్ హాస్టల్ అయినా, బాయ్స్ హాస్టల్ అయినా ఇంచుమించు ఒకేలా ఉంటాయి. కాకపోతే లేడీస్ హాస్టల్ లో కొన్ని రూల్స్ ఉంటాయి అంతే. ఈతరం యూత్ కు మ్యూజిక్ వినడం అలవాటు. బోర్ కొట్టినప్పుడే కాకుండా బాత్ రూం (Bathroom) లో స్నానం చేస్తున్నప్పుడు కూడా ఇష్టమైన పాటలు వింటుంటారు.
అయితే ఓ హాస్టల్ లో ఓ యువతి స్నానం చేసుకుంటూ ఫోన్ లో పాటలు వినేది. ఆ అమ్మాయికి అలవాటు కూడా. అయితే ఏమైందో ఏమోకానీ హాస్టల్ వార్డెన్ ఆ అమ్మాయికి వార్నింగ్ శచ్చింది. పాటలు విన్నందుకు క్షమాపణ లేఖ రాయలంటూ అమల్ జ్యోతి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ విద్యార్థినిపై ఒత్తిడి తెచ్చింది. దీంతో ఆ అమ్మాయి వెంటనే స్వారీ లెటర్ (Sorry Letter) రాసింది.
“డియర్ సిస్టర్ స్నానం చేస్తున్నప్పుడు నా ఫోన్‌లో పాటలు విన్నందుకు నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. ఈ తప్పు మళ్లీ జరగదు. కాలేజీ ప్రాజెక్ట్‌లు పూర్తి చేయవలసి ఉన్నందున నా ఫోన్‌ను తిరిగి ఇవ్వవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను” అని లెటర్ రాయడం ఆశ్చర్యపర్చింది. ఈ ఇష్యూ సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. “హాస్టల్లో ఇలాంటి రూల్స్ ఉంటాయా? స్నానం చేసేటప్పుడు సంగీతం (Music and Songs) వినకూడదా?” అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Where is Saif: రావణుడు ఎక్కడ? ఆదిపురుష్ ప్రమోషన్లకు ‘సైఫ్’ డుమ్మా, అసలు కారణమిదే!