Indian Lesson-China Books : చైనా స్కూల్ బుక్స్ లో భారతీయుడి లెస్సన్.. ఎవరాయన ?
Indian Lesson-China Books : చైనాలోని స్కూల్ పుస్తకాల్లో ఓ భారతీయుడి కథ లెస్సన్ గా చేరింది. ఆయనే దేవ్ రాటూరి.
- By Pasha Published Date - 04:37 PM, Wed - 26 July 23

Indian Lesson-China Books : చైనాలోని స్కూల్ పుస్తకాల్లో ఓ భారతీయుడి కథ లెస్సన్ గా చేరింది. ఆయనే దేవ్ రాటూరి. ఉత్తరాఖండ్ లోని తెహ్రీ గఢ్వాల్ జిల్లా కెమ్రియా సౌర్ గ్రామంలో పుట్టిన దేవ్ రాటూరి.. ఇప్పుడు చైనా సినీరంగంలో పాపులర్ స్టార్. ఇప్పటివరకు 35 చైనీస్ సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించారు. వెయిటర్ నుంచి పాపులర్ స్టార్ దాకా ఆయన సక్సెస్ జర్నీని విద్యార్థులకు చెప్పి వారిలో స్ఫూర్తిని నింపేందుకు ఈ లెస్సన్ ను బుక్స్ లో చేర్చారు. 2005లో చైనాలోని ఓ భారత రెస్టారెంట్ లో వెయిటర్‌గా దేవ్ రాటూరి చేరారు. 2013లో మరో పెద్ద హోటల్‌లో ఆయనకు మేనేజర్ జాబ్ వచ్చింది.
Also read : Telangana Women: అమెరికాలో ఆకలితో అలమటిస్తున్న తెలంగాణ యువతి.. జై శంకర్ కు లేఖ రాసిన తల్లి?
కొన్నాళ్లకు చైనాలోని షియాన్ సిటీలో ‘రెడ్ ఫోర్ట్’ పేరుతో సొంతంగా రెస్టారెంట్ ను ప్రారంభించారు. 2017లో దేవ్ రాటూరి రెస్టారెంట్ కు వచ్చిన చైనా డైరెక్టర్ ఒకరు.. సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చారు. దీంతో ‘స్వాట్’ అనే టీవీ సిరీస్‌లో చిన్న పాత్రలో దేవ్ రాటూరి నటించారు. అది హిట్ కావడంతో ఆయన జీవితం ఒక్కసారిగా మారిపోయింది. సినిమాల్లో వచ్చిన పాపులారిటీ ఆయన వ్యాపారానికి కూడా కలిసొచ్చింది. ఇప్పుడు దేవ్ కు చైనాలో ఎనిమిది రెస్టారెంట్లు ఉన్నాయి. పొరుగు దేశంలో స్థిరపడినా మాతృభూమిపై ప్రేమను దేవ్ రాటూరి(Indian Lesson-China Books) మర్చిపోలేదు. అందుకే తన గ్రామం నుంచి 150 మందిని తీసుకెళ్లి ఉద్యోగాలిచ్చారు.