Variety Restaurant : సాంబార్ వడ, దోశ, ఇడ్లి.. అమెరికా రెస్టారెంట్ లో పేరు మారింది!!
ఇడ్లీ ,దోశ, వడ.. ఇవి మన ఇండియన్స్ ఇష్టపడే టిఫిన్స్. అమెరికాలో వీటి జాడ ఉండదు.
- By Hashtag U Published Date - 07:00 PM, Tue - 19 July 22
ఇడ్లీ ,దోశ, వడ.. ఇవి మన ఇండియన్స్ ఇష్టపడే టిఫిన్స్. అమెరికాలో వీటి జాడ ఉండదు. ఈనేపథ్యంలో అమెరికాలోని ఓ భారతీయ రెస్టారెంట్ ఇన్నోవేటివ్ గా ఆలోచించింది. ఇడ్లీ ,దోశ, తదితర భారతీయ వంటకాలను పేర్లు మార్చేసి వినియోగదారులకు ఇంట్రడ్యూస్ చేసింది.ఆ మెనూ తాలూకు స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్ల మధ్య వాడివేడి డిబేట్ జరుగుతోంది. సాంబార్ ఇడ్లీ పేరును “డంక్డ్ రైస్ కేక్ డిలైట్”, సాంబార్ వడ పేరును ” డంక్డ్ డోనట్ డిలైట్ “, ప్లెయిన్ దోశ పేరును “నేకెడ్ క్రెప్స్”, మసాలా దోశ పేరును “స్మాష్డ్ పొటాటో క్రెప్” గా మార్చారు. రైస్ కేక్, డోనట్, క్రెప్స్ వంటివి విదేశీయులకు తెలిసిన వంటకాల పేర్లు. వాటిని మెనూలో చేర్చడం మన ఇండియా టిఫిన్స్ కు అమెరికన్ ఇమేజ్ ను సృష్టించారు.
omfg pic.twitter.com/EEIkpBJcoA
— inika⛓ (@inika__) July 16, 2022
ఈ రెస్టారెంట్ ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న వారూ ఉన్నారు. విదేశీయులకు ఇవేంటో తెలియదు కాబట్టి.. వారికి తెలిసిన పదాలతో భారతీయ వంటకాలకు కొత్త పేర్లు పెట్టి ఉండొచ్చని పలువురు అభిప్రాయపడ్డారు. మరోవైపు
తాము లొట్టలేసుకుంటూ తినే ఆహారానికి పేర్లు మార్చడం కొందరు భారతీయులకు అస్సలు మింగుడు పడలేదు. ఇదేం చోద్యం అని వారు మండిపడుతున్నారు. మా గుండె పగిలిపోయింది అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఏదిఏమైనా భారతీయ వంటకాల రుచిని ఇతర దేశస్తులూ ఆదరించి తీరుతారు. పసుపు, కారం, సుగంధ ద్రవ్యాలతో ఆరోగ్యకరంగా తయారయ్యే భారతీయ వంటకాలు హాట్ ఫెవరేట్ గా మారుతాయి.
Related News
Black Rice Idli: బ్లాక్ రైస్ ఇడ్లీ.. ఇలా చేస్తే చాలు ఒక్కటి కూడా మిగలదు?
మామూలుగా మనం ఇడ్లీ పిండితో తయారుచేసిన ఇడ్లీలను ఎక్కువగా తింటూ ఉంటాం. అయితే కొందరు రాగి ఇడ్లీ కొందరు జొన్న ఇడ్లీ అంటూ డిఫరెంట్ ఇడ్లీలను కూడా