Pilot Arrest : పైలట్ అరెస్టు.. 267 మంది ప్రయాణికులకు షాక్.. ఏమైంది ?
Pilot Arrest : 267 మంది ప్రయాణికులు సీట్లలో కూర్చొని విమానం టేకాఫ్ కోసం ఎదురు చూస్తున్నారు. పైలట్ నడుచుకుంటూ ఆ విమానం వైపు మెల్లగా వస్తున్నాడు.
- By Pasha Published Date - 03:31 PM, Sat - 29 July 23

Pilot Arrest : 267 మంది ప్రయాణికులు సీట్లలో కూర్చొని విమానం టేకాఫ్ కోసం ఎదురు చూస్తున్నారు.
పైలట్ నడుచుకుంటూ ఆ విమానం వైపు మెల్లగా వస్తున్నాడు.
అతడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి.. తూలుతూ నడుస్తున్నాడు..
దీంతో సదరు పైలట్‌ను ఎయిర్‌పోర్టు భద్రతాధికారులు ఆపారు..
ఆల్కహాల్ టెస్టు చేయగా.. బాగా మద్యం తాగి డ్యూటీకి వస్తున్నాడని తేలింది..
దీంతో పైలట్‌ను అరెస్టు చేసి.. ఆ విమానాన్ని రద్దు చేశారు.
Also read : Sreeleela With Charan: జాక్ పాట్ కొట్టిన శ్రీలీల, రామ్ చరణ్ తో యంగ్ బ్యూటీ రొమాన్స్?
ఈ ఘటన ఫ్రాన్స్ రాజధాని పారిస్ లోని ఎయిర్ పోర్ట్ లో చోటుచేసుకుంది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం పారిస్ నుంచి అమెరికాలోని వాషింగ్టన్ డీసీకి బయలుదేరేందుకు సిద్ధంగా ఉండగా.. పైలట్ ను అరెస్ట్ చేయడంతో (Pilot Arrest) ప్రయాణికులు అవాక్కయ్యారు. అతడు విమానం నడిపి ఉంటే ఏం జరిగి ఉండేదో అని ఒకరికొకరు చెప్పుకున్నారు. వెంటనే మరో విమానం ద్వారా ప్రయాణికులు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.
Also read : Nargis Haunted House : నర్గీస్ ఫక్రి కు రాత్రిపూట అలాంటి కలలు వచ్చేవట..