5,500 troops Killed: 2 వారాల్లో 2,218 మంది ఉక్రెయిన్ సైనికులు మృతి.. మరో 3వేల మందికి గాయాలు
రష్యా సైన్యం దాడుల్లో ఉక్రెయిన్ సైనికుల మరణాలు ఆగడం లేదు. గత 2 వారాల్లోనే దాదాపు 2,218 మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయారు.
- By Hashtag U Published Date - 07:52 AM, Tue - 5 July 22
రష్యా సైన్యం దాడుల్లో ఉక్రెయిన్ సైనికుల మరణాలు ఆగడం లేదు. గత 2 వారాల్లోనే దాదాపు 2,218 మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయారు. మరో 3వేల మంది ఉక్రెయిన్ సైనికుల్లో కొంతమందికి తీవ్ర గాయాలు కాగా, ఇంకొందరు రష్యా సైన్యానికి బందీలుగా మారారు.
మరికొందరు ఉక్రెయిన్ సైనికుల ఆచూకీ తెలియడం లేదు. ఈవిషయాన్ని స్వయంగా రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గి షోయిగు సోమవారం వెల్లడించారు.రష్యా అధ్యక్షుడు పుతిన్ కు సమర్పించిన నివేదిక లో ఈ వివరాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. లుగాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ ఏరియా పై రష్యా సైన్యం పూర్తిగా పట్టు బిగించిందని వెల్లడించారు. ఇదే వ్యవధిలో ఉక్రెయిన్ కు చెందిన 12 యుద్ధ విమానాలు, 6 దీర్ఘ శ్రేణి క్షిపణులు, 97 రాకెట్ ఆర్టిలరి లాంచర్స్, 200 యుద్ధ ట్యాంకులు దెబ్బతిన్నాయని తెలిపారు. లిసి ఛాన్స్క్ పట్టణంలో ఉక్రెయిన్ సైన్యం దాచిన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.ఈనేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కి.. తమ దేశానికి సైనిక, ఆయుధ సాయం అందించాలని గత కొన్ని వారాలుగా వరుస విజ్ఞప్తులు చేస్తున్నారు. ప్రధానంగా ఐరోపా దేశాల అధినేతలతో దీనిపై జెలెన్ స్కి మాట్లాడుతున్నారు.
రష్యాలో ఉక్రెయిన్ రహస్య దళం?
ఉక్రెయిన్‌కు చెందిన రహస్య దళం “షామన్ బెటాలియన్” రష్యాలో స్పెషల్ ఆపరేషన్ చేస్తోందా ? ఇటీవల రష్యాలోని బెల్గోరోడ్ నగరంలో జరిగిన పేలుళ్లు దాని పనేనా ? అంటే ఔననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
ఈ దాడుల్లో ముగ్గురు పౌరులు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. 11 అపార్ట్మెంట్లు, 39 నివాస గృహాలు దెబ్బతిన్నాయి. ఉక్రెయిన్ పై దాడికి వేదికగా మారిన రష్యాలోని సైనిక స్థావరాలను కూడా “షామన్ బెటాలియన్” టార్గెట్ గా మార్చుకున్నట్లు సమాచారం.
Related News
Israel-Hamas Conflict: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని ఖండించిన ఒబామా
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని తీవ్రంగా ఖండించాడు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. అనేక మంది అమాయక ఇజ్రాయిలీలను చంపిన దాడిని ఖండించడమే కాకుండా పాలస్తీనాలోని పౌరుల బాధలను కూడా గుర్తు చేసుకున్నాడు.