Utsah Portal : యూజీసీ వెబ్ సైట్ పేరు ఇక “ఉత్సాహ్”
Utsah Portal : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) వెబ్‌సైట్ పేరు ఈరోజు (మే 16) నుంచి "ఉత్సాహ్" (అండర్ టేకింగ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్) గా మారిపోనుంది.
- By Pasha Published Date - 08:38 AM, Tue - 16 May 23

Utsah Portal : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) వెబ్‌సైట్ పేరు ఈరోజు (మే 16) నుంచి “ఉత్సాహ్” (అండర్ టేకింగ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్) గా మారిపోనుంది. ఈవిషయాన్ని యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్ వెల్లడించారు. “ఉత్సాహ్” పోర్టల్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లాంచ్ చేస్తారని తెలిపారు. జాతీయ విద్యా విధానం (NEP) 2020 సిఫార్సుల ప్రకారం.. యూజీసీ పోర్టల్ ను ఉత్సాహ్(Utsah Portal) పోర్టల్ గా రీడిజైన్ చేశామని తెలిపారు. ఇందులో విద్యార్థులు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల కేటగిరీల పరిధిలోని మొత్తం సమాచారాన్ని సులభంగా చూడొచ్చని వివరించారు.
ALSO READ : Fake Universities : దేశంలో 21 ఫేక్ యూనివర్సిటీల లిస్ట్ విడుదల చేసిన యూజీసీ
యూనివర్సిటీలు, ప్రొఫెసర్లు, విద్యార్థుల సౌకర్యార్థం..
యూనివర్సిటీలు, ప్రొఫెసర్లు, విద్యార్థుల సౌకర్యార్థం.. వారి అవసరాలను తీర్చేలా ఈ పోర్టల్ రూపొందించామని జగదీష్ కుమార్ అన్నారు. కళాశాల పరివర్తన, నైపుణ్యాభివృద్ధి, ఇంటర్న్‌షిప్, స్టార్టప్, స్కాలర్‌షిప్, కోర్సు, విశ్వవిద్యాలయం, సిలబస్, నియంత్రణ, ప్లేస్‌మెంట్, విదేశీ విశ్వవిద్యాలయం మొదలైన వాటి గురించి సవివరమైన సమాచారం అందుబాటులో ఉంటుందని చెప్పారు. UGC సరికొత్తగా డిజైన్ చేయించిన Utsah Portalలోకి లాగిన్ కావడానికి AISHE కోడ్‌ని ఉపయోగించి విశ్వవిద్యాలయాలు లాగిన్ అవుతాయన్నారు. దీంతోపాటు ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ (PoP) పేరిట మరో పోర్టల్ ను కూడా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇవాళ లాంచ్ చేయనుంది. అనుభవజ్ఞులైన బోధనా నిపుణులను గుర్తించడంలో విశ్వవిద్యాలయాలకు ఈ పోర్టల్ సహాయపడుతుంది.