అమెరికా రాజధాని వాషింగ్టన్ లోని పెంటగాన్ సమీపంలో పేలుడు జరిగిందంటూ ఫేక్ ఇమేజ్ ఒకటి ఇటీవల ట్విట్టర్ లో వైరల్ అయింది. దీనిపై అమెరికాలో చాలామంది నెటిజన్స్ ట్విట్టర్ కు కంప్లైంట్స్ చేశారు. దీంతో అటువంటి ఫేక్ ఫోటోలు, వీడియోలను గుర్తించే లక్ష్యంతో “నోట్స్ ఆన్ మీడియా” ఫీచర్ ను ట్విట్టర్ టెస్ట్ చేస్తోంది. తప్పుదారి పట్టించే ఫోటో, వీడియో కింద నోట్స్ రాసే సౌకర్యాన్ని, అవకాశాన్ని నెటిజన్స్ కు ఇస్తోంది. ఇప్పటికే ఈ ఫీచర్ సింగిల్ ఇమేజ్‌లకు అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే ఒకేసారి ఒకటికి మించి ఫేక్ ఫోటోలు, వీడియోలకు నోట్స్ రాసే ఛాన్స్ కూడా కల్పించనున్నారు. మనం ఏదైనా ఫేక్ వీడియో లేదా ఫోటో పై నోట్స్ రాస్తే.. ట్విట్టర్ లో అప్ లోడ్ అయ్యే అలాంటి అన్ని ఫోటోలపై ఆ నోట్స్ కనిపించనుంది.
Twitter New Feature : ఒక్క ఫేక్ ఫోటో.. కొత్త ఫీచర్ తెచ్చేలా చేసింది
Twitter New Feature : ట్విట్టర్ ఇప్పుడు తన ప్లాట్ ఫామ్ లో పబ్లిష్ అయ్యే కంటెంట్ క్వాలిటీపై ఫోకస్ పెట్టింది. తప్పుదారి పట్టించే ఫోటోలు, వీడియోలు ఎవరైనా పోస్ట్ చేస్తే.. వెంటనే గుర్తించడానికి కొత్త ఫీచర్‌ను ట్విట్టర్ పరీక్షిస్తోంది.
- By Pasha Published Date - 10:56 AM, Wed - 31 May 23

Twitter New Feature : ట్విట్టర్ ఇప్పుడు తన ప్లాట్ ఫామ్ లో పబ్లిష్ అయ్యే కంటెంట్ క్వాలిటీపై ఫోకస్ పెట్టింది.
తప్పుదారి పట్టించే ఫోటోలు, వీడియోలు ఎవరైనా పోస్ట్ చేస్తే.. వెంటనే గుర్తించడానికి కొత్త ఫీచర్‌ను ట్విట్టర్ పరీక్షిస్తోంది.
తప్పుడు ఫోటోలు, వీడియోలపై కొరడా ఝుళిపించేందుకే ట్విట్టర్ రెడీ అవుతోంది. ఇందుకోసం “నోట్స్ ఆన్ మీడియా” పేరుతో ఒక ఫీచర్ ను(Twitter New Feature) టెస్ట్ చేస్తోంది. ఈ ఫీచర్ ను వినియోగించి ట్విట్టర్ వినియోగదారులు.. తమను తప్పుదోవ పట్టించే ఫోటోలు, వీడియోలను ఈజీగా గుర్తించవచ్చు. క్రౌడ్ సోర్స్డ్ ఫ్యాక్ట్ చెక్ అనే ఒక ఫీచర్ ఇప్పటికే ట్విట్టర్ లో ఉంది. ఇకపై ఈ ఫీచర్ ట్విట్టర్ లో పోస్ట్ అయ్యే ఫోటోలు, వీడియో క్లిప్‌లకు కూడా లింక్ కానుంది. ఏదైనా ఫోటో, వీడియో క్లిప్ లోని సమాచారం ఫేక్ అనిపిస్తే.. దానిపై క్లిక్ చేసి “నోట్స్ ఆన్ మీడియా” ఫీచర్ ను వాడుకోవచ్చు. దానికి సంబంధించి మీకు ఉన్న అభ్యంతరాన్ని, సందేహాన్ని, సమాచారాన్ని అక్కడ రాయొచ్చు. ఆ తర్వాత.. అలాంటి ఇమేజెస్ లేదా వీడియో క్లిప్స్ ను ఇతర నెటిజన్స్ ట్విట్టర్ లో తెరిచినప్పుడు వాటిపై మీడియా నోట్స్ లో రాసిన ఇన్ఫో కనిపిస్తుంది. ” ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో రూపొందించిన ఫోటోల నుంచి మానిప్యులేటెడ్ వీడియోల వరకు అన్నింటినీ గుర్తించగానే.. దానిపై నోట్స్ రాసి ఇతరులను అలర్ట్ చేసే గొప్ప ఫీచర్ ఇది” అంటూ ట్విట్టర్ కమ్యూనిటీ నోట్స్ విభాగం వెల్లడించింది.
Raters and readers will see notes that authors marked as “about the image” slightly differently, so it’s clear to everyone that they should be interpreted as about the media, not the specific Tweet. Ratings can help identify cases where a note may not apply to a specific Tweet. pic.twitter.com/EDkSfRfxHv
— Community Notes (@CommunityNotes) May 30, 2023
Also read : Twitter 2 Features : ట్విట్టర్ వీడియోలకు 2 కొత్త ఫీచర్లు
పెంటగాన్ పేలుడుపై ఫేక్ ఫోటోతో దుమారం