Turkey to Guntur: అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి!
వాళిద్దరి దేశాలు వేర్వేరు.. అయితేనేం ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆ తర్వాత పెద్దల ఆశీర్వాదంతో పెళ్లితో ఒక్కటయ్యారు. టర్కీకి చెందిన ఓ మహిళ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన వ్యక్తితో మంగళవారం సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుంది.
- By Balu J Published Date - 01:12 PM, Thu - 30 December 21

వాళిద్దరి దేశాలు వేర్వేరు.. అయితేనేం ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆ తర్వాత పెద్దల ఆశీర్వాదంతో పెళ్లితో ఒక్కటయ్యారు. టర్కీకి చెందిన ఓ మహిళ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన యువకుడితో మంగళవారం సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుంది. ఈ వివాహ వేడుకకు పలువురు హాజరై నూతన వధువరూలను ఆశీర్వదించారు. గుంటూరులో నివాసముంటున్న వరుడు మధు సంకీర్త్ కు 2016లో గిజెమ్ అనే అమ్మాయి పరిచయం ఏర్పడింది. వర్క్ ప్రాజెక్టులో భాగంగా గిజెమ్, మధు కలుసుకుని క్రమంగా స్నేహితులయ్యారు. తరువాత మధు టర్కీకి వెళ్లాడు. వారి మధ్య ప్రేమ చిగురించడానికి ఎక్కువ సమయం పట్టలేదు.
స్నేహంతో మొదలైన పరిచయం ప్రేమకు దారితీసింది. పెళ్లిచేసుకోవాలని కలలు కన్నారు. అయితే ఇద్దరి ఇష్టాన్ని ఇరు కుటుంబాలు వ్యతిరేకించాయి. కానీ చివరకు, ఇద్దరూ తమ తల్లిదండ్రులను ఒప్పించి 2019లో నిశ్చితార్థం చేసుకున్నారు. 2020లో వివాహం చేసుకోవాలనుకున్నారు. కానీ కోవిడ్ 19 పరిమితుల కారణంగా సాధ్యపడలేదు. జూలైలో వారిద్దరూ మొదట టర్కీలో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు కులం, భాష, ప్రాంతం వంటి అన్ని అడ్డంకులను చెరిపివేస్తూ తెలుగు సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.