TRS Kavitha: ఎమ్మెల్సీ కవితకు షాకిచ్చిన నెటిజన్..పాపం ఎంత కష్టమోచ్చే..!!
మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత...సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.
- By Hashtag U Published Date - 10:15 AM, Mon - 30 May 22
మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత…సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఏదోక అంశంపై నిత్యం పోస్టు పెడుతూనే ఉంటారు. ఆమెకు సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. అందులోనూ సీఎం కేసీఆర్ కుమార్తె కావడంతో పెద్దెత్తున సెలబ్రిటీలతోపాటుగా సామాన్య ప్రజలు కూడా అనుసరిస్తుంటారు. ఇందులో భాగంగానే ట్విట్టర్ లో కవిత పెట్టిన పోస్టుపై నెటిజన్లు ఆమెను విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.
కవిత పెట్టిన పోస్టు ఏంటంటే…ఈనాడు సండే మ్యాగజైన్ లో పద వినోదం శీర్షిక చాలా పాపులర్ అనే సంగతి తెలిసిందే. భాషా పరిజ్ఞానాన్ని పరీక్షిస్తూ సాగే ఈ పద వినోదం చాలామంది అభిమానులున్నారు. కవిత కూడా పదవినోదం పూర్తిగా నింపకుండా i give upఅంటూ ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఈ ట్వీట్ పై ఓ నెటిజన్ మండిపోయాడు. తెలంగాణలో రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే…మీ నాన్న ఫాం హౌజ్ లో మీ అన్న ఫారిన్ ట్రిప్ లో …మీరెమో ఉల్లాసంగా పదవినోదం పూర్తి చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అంటూ ట్వీట్ చేశాడు. ప్రజలు ఏమైతే మీకేంటి…అంటూ కవిత ట్వీట్ కు రిప్లై ఇచ్చాడు. దీంతో ఆ నెటిజన్ కు కొంతమంది సానుకూలంగా ఉంటే మరికొంతమంది వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. ఏదో ఆదివారం అని సరదాగా ట్వీట్ చేస్తే…పాపం కేసీఆర్ ముద్దుల కూతురుకు ఇంత కష్టం వచ్చిందా అంటూ కవిత అభిమానులు బాధపడుతున్నారు.
I give up 😬 pic.twitter.com/ENHSPKQpZS
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 29, 2022
Related News
LS Polls : సికింద్రాబాద్, మల్కాజిగిరిలో ఆంధ్రా సెటిలర్ల ఓట్లు నిర్ణయాత్మకం
లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల భవితవ్యాన్ని ఖరారు చేయడంలో హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తులతో రాజకీయ పార్టీలు రకరకాల వాగ్దానాలతో వారిని ప్రలోభపెడుతున్నాయి.