Viral Video : కప్ప వర్సెస్ కప్ప.. “బాటిల్ క్యాప్” బ్యాటిల్!!
ఒక బాటిల్ క్యాప్ ..రెండు కప్పలు !!బాటిల్ క్యాప్ పై అప్పటికే ఒక కప్ప కూర్చొని ఎంచక్కా జర్నీ చేస్తోంది.ఇంతలోనే వెనక నుంచి మరో కప్ప .. ఆ బాటిల్ క్యాప్ పైకి దూకేందుకు ప్రయత్నిస్తుంది.ఈక్రమంలో అప్పటికే బాటిల్ క్యాప్ పై తిష్ట వేసి ఉన్న కప్ప.. దాన్ని ఎడమ కాలితో తన్నుతుంది.
- By Hashtag U Published Date - 07:00 PM, Mon - 15 August 22
ఒక బాటిల్ క్యాప్ ..రెండు కప్పలు !!బాటిల్ క్యాప్ పై అప్పటికే ఒక కప్ప కూర్చొని ఎంచక్కా జర్నీ చేస్తోంది.ఇంతలోనే వెనక నుంచి మరో కప్ప .. ఆ బాటిల్ క్యాప్ పైకి దూకేందుకు ప్రయత్నిస్తుంది.ఈక్రమంలో అప్పటికే బాటిల్ క్యాప్ పై తిష్ట వేసి ఉన్న కప్ప.. దాన్ని ఎడమ కాలితో తన్నుతుంది. ప్రతిసారి అది ఇలాగే తన్నడం.. వెనుక నుంచి జంప్ చేసే కప్ప నీళ్లలో పడిపోవడం ఈ వీడియోలో కనిపిస్తుంది.
https://twitter.com/buitengebieden/status/155778413226412032
బాటిల్ క్యాప్ పై జర్నీ చేసేందుకు ఆ రెండు కప్పల మధ్య జరిగిన పోటీకి నిదర్శనం ఈ వీడియో.దీన్ని చూసి నెటిజన్స్ కడుపుబ్బా నవ్వుతున్నారు. అందరికి షేర్ చేస్తున్నారు. మూడు రోజుల క్రితం ట్విటర్ లో అప్ లోడ్ చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకు 1.3 కోట్ల వ్యూస్ వచ్చాయి.72వేల మంది ఈ వీడియోను రీట్వీట్ చేశారు. 4.46 లక్షల మంది దీన్ని లైక్ చేయడం విశేషం.”ఈ వీడియోను చూసి నవ్వి నవ్వి నా కడుపులో నొప్పి పుట్టింది” అని ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు.
“ఆ కప్ప.. భలేగా తన్నులు తింటోంది కదూ” అని మరొకరు వ్యాఖ్యానించారు. ఈ వీడియోను మీరు కూడా చూడాలని భావిస్తే “Buitengebieden” అనే ట్విట్టర్ ఖాతాలోకి వెళ్ళండి. చూసి ఎంజాయ్ చేయండి. కడుపుబ్బా నవ్వండి. ఇతరులకు ఈ వీడియో ను షేర్.. వాళ్లకు కూడా నవ్వే ఛాన్స్ ఇవ్వండి.
Related News
Bill Gates Enjoys Tea: చాయ్వాలాతో బిల్‌గేట్స్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఇటీవల నాగ్‌పూర్‌లోని ప్రసిద్ధ డాలీ చాయ్వాలాతో బిల్ గేట్స్ (Bill Gates Enjoys Tea) ఉన్న వీడియో వైరల్‌గా మారింది. బిల్ గేట్స్ ఈ ప్రత్యేక శైలిని ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు.