Super Fast Display : సూపర్ ఫాస్ట్ డిస్‌ప్లేతో ప్రపంచంలోనే తొలి ఫోన్
Super Fast Display : సూపర్ ఫాస్ట్ డిస్‌ప్లే ఆప్షన్లతో ‘రియల్‌మీ జీటీ నియో 6 ఎస్ఈ’ మోడల్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది.
- Author : Pasha
Date : 13-04-2024 - 8:42 IST
Published By : Hashtagu Telugu Desk
Super Fast Display : సూపర్ ఫాస్ట్ డిస్‌ప్లే ఆప్షన్లతో ‘రియల్‌మీ జీటీ నియో 6 ఎస్ఈ’ మోడల్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఇందులో 6.78 అంగుళాల 1.5కే (1,264x 2780 pixels) ‘8టీ ఎల్టీపీవో ఓఎల్ఈడీ డిస్‌ప్లే’ ఉంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్. టచ్ శాంప్లింగ్ రేట్ 360 హెర్ట్జ్. పీక్ బ్రైట్‌నెస్ 6000 నిట్స్. గేమింగ్‌కు సపోర్ట్ చేసే ప్రత్యేకమైన డిస్‌ప్లే ఈ ఫోన్‌లో ఉంది. ఈ తరహా డిస్‌ప్లేతో మొబైల్ లాంచ్ కావడం ప్రపంచంలో ఇదే తొలిసారి అని అంటున్నారు. 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్న మొదటి ఫోన్ కూడా ఇదేనని చెబుతున్నారు. దీని మరిన్ని వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
వాస్తవానికి రియల్‌మీ జీటీ నియో 6 ఎస్ఈ స్మార్ట్ ఫోన్ లాంఛ్ అయింది మన దేశంలో కాదు చైనాలో!! ఇది క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ జెన్ 3 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్ 5ఎక్స్ ర్యామ్, 512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 ఆన్‌బోర్డ్ స్టోరేజీ ఇందులో ఉంటాయి. గేమింగ్ కోసం ఇందులో ప్రత్యేకంగా 3డీ కూలింగ్ సిస్టం ఉంది. ఈ ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను(Super Fast Display) సపోర్ట్ చేసే 5500 ఎంఏహెచ్ బ్యాటరీ అందుబాటులో ఉంది.
Also Read : Hyderabad Lok Sabha : ‘మజ్లిస్’ కంచుకోటలో కాంగ్రెస్ అభ్యర్థిపై ఉత్కంఠ
కెమెరాలు అదుర్స్
- రియల్‌మీ జీటీ నియో 6 ఎస్ఈ స్మార్ట్ ఫోన్‌లోని కెమెరాల విషయానికి వస్తే… ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి.
- మెయిన్ కెమెరా కెపాసిటీ 50 మెగాపిక్సెల్. దీంతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌ను కూడా అందించారు.
- సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 615 కెమెరా ఉంది.
- 5జీ, వైఫై, బ్లూటూత్ వీ 5.4, బైదు, జీపీఎస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, నావిక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
- జియో మ్యాగ్నటిక్ సెన్సార్, లైట్ సెన్సార్, కలర్ టెంపరేచర్, అండర్ స్క్రీన్ ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సెలరేషన్ సెన్సార్, గ్రావిటీ సెన్సార్, గైరో స్కోప్‌లను కూడా అందించారు.
- ఈ ఫోన్‌లోని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్.
- 100 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
- డ్యూయల్ స్పీకర్లు, డ్యూయల్ మైక్రోఫోన్లు ఇందులో ఉన్నాయి.
- ఫోన్ బరువు 191 గ్రాములు. దీని మందం 0.86 సెంటీమీటర్లు.
Also Read :Atal Pension Yojana: నెలకు రూ. 5000 పింఛన్ పొందండిలా.. ముందుగా మీరు చేయాల్సింది ఇదే..!
రియల్‌మీ జీటీ నియో 6 ఎస్ఈ ఫోన్ నాలుగు వేరియంట్లలో లభించనుంది. బేస్ వేరియంట్ ధర మన దేశంలో దాదాపు రూ.18,000 ఉంటుందని అంచనా వేస్తున్నారు. రెండు కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ చైనా మార్కెట్లో లాంచ్ అయింది. త్వరలో మనదేశంలోనూ ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.