Sankranti 2025 : ముగ్గు వేస్కో..5G ఫోన్ గెలుచుకో
Sankranti 2025 : ముఖ్యంగా ధాన్యం కుండలు ఉన్న ముగ్గులు వేస్తుంటారు
- By Sudheer Published Date - 01:11 PM, Sun - 12 January 25

సంక్రాంతి (Sankranti ) అంటేనే అందరికీ గుర్తొచ్చేది ముగ్గులు (Rangoli). ప్రతి ఇంటి ముందు రంగురంగుల రంగవల్లులు దర్శనమిస్తాయి. మగువలు రోజొక్క తీరు ముగ్గుతో తమ ముంగిలిని అందంగా ముస్తాబు చేస్తారు. కొందరు చుక్కల ముగ్గులు వేస్తే మరికొందరు డిజైన్ ముగ్గులు వేస్తుంటారు. ముఖ్యంగా ధాన్యం కుండలు ఉన్న ముగ్గులు వేస్తుంటారు. వీటితో పాటు చెరుకు గడలు ఉండే విధంగా రెండింటిని కలిపి సంక్రాంతి వెలుగులు వచ్చేలా రంగవల్లికలు వేస్తారు. ఇక పల్లెల్లో ముగ్గుల పోటీలు పెద్ద ఎత్తున జరుపుతుంటారు.
National Youth Day : స్వామి వివేకానంద జయంతి నాడు జాతీయ యువజన దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు..?
ఇక ఇప్పుడు తెలుగు NRI రేడియో (Telugu NRI Radio) ‘ముత్యాల ముగ్గు’ (Mutyala Muggu) కాంటెస్టు ప్రకటించింది. ఈ పోటీలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మహిళలు పాల్గొని అదిరిపోయే బహుమతులు గెలుచుకోవచ్చు. ఈ కాంటెస్టు ద్వారా, మొదటి బహుమతిగా శాంసంగ్ 5G ఫోన్, రెండో బహుమతిగా ఒప్పో 5G ఫోన్, మూడో బహుమతిగా వీవో 5G ఫోన్ లు ఇవ్వనున్నారు. ఈ పోటీలో పాల్గొనడం చాలా సులభం. నేరుగా ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. సంక్రాంతి రోజున ఇంటిముందు ముగ్గు వేసి, ఆ ముగ్గు పక్కన “తెలుగు NRI రేడియో – 2025 (తెలుగువారి గుండె చప్పుడు)” అని రాసి ఫోటో తీసి వాట్సాప్ నెంబర్ (+91 8125974330)కి పంపితే చాలు.
ఇది ఒక సువర్ణ అవకాశమే. అందరూ తమ కళాత్మకతను ప్రదర్శించి, ఆకర్షణీయమైన బహుమతులు గెలుచుకోవచ్చు. ఈ పోటీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మహిళలు మాత్రమే అర్హులు. పోటీలో పాల్గొనడానికి ఏదైనా రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. కేవలం ఫోటో పంపించాల్సి ఉంటుంది. ఈ పోటీ కోసం చివరి తేదీ జనవరి 18, 2025. ఈ తేది లోగా పంపించిన ముచ్చటైన ముగ్గులు చెల్లించబడతాయి. సుదీర్ఘంగా అద్భుతమైన ముగ్గులు వేసిన వారు ప్రత్యేకంగా ఎంపిక చేయబడతారు. మరి ఆలస్యం ఎందుకు..ఇప్పుడే రంగు రంగుల ముగ్గులు వేసి, సంక్రాంతి పండగను ప్రత్యేకంగా జరుపుకోండి, అదిరిపోయే 5G ఫోన్లు గెలుచుకోండి!