Sunita Williams : క్షేమంగా భూమి మీదకు వచ్చిన సునీతా విలియమ్స్..నెక్స్ట్ సమస్యలు అవే !
Sunita Williams : మొదట 8 రోజుల పాటు మాత్రమే ISS (ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్) లో ఉండాల్సిన ఆమె, అనివార్య కారణాల వల్ల 286 రోజుల (286 Days) పాటు అంతరిక్షం(Space)లోనే ఉండిపోయారు
- By Sudheer Published Date - 07:46 AM, Wed - 19 March 25

అంతరిక్ష ప్రయాణం అనేది అత్యంత క్లిష్టమైనదే కాదు, భూమికి తిరిగి వచ్చిన తర్వాత సైతం వ్యోమగాములకు అనేక ఆరోగ్యపరమైన సవాళ్లు ఎదురవుతాయి. భారతీయ మూలాలున్న అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) ఈరోజు భూమికి తిరిగి చేరారు. మొదట 8 రోజుల పాటు మాత్రమే ISS (ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్) లో ఉండాల్సిన ఆమె, అనివార్య కారణాల వల్ల 286 రోజుల (286 Days) పాటు అంతరిక్షం(Space)లోనే ఉండిపోయారు. ఎన్నో సవాళ్లు, అనుభవాలను ఎదుర్కొన్న ఆమె, భూమికి చేరుకున్న వెంటనే స్ట్రెచ్చర్ సహాయంతో క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చారు. అయినా తన మనోధైర్యాన్ని కోల్పోకుండా నవ్వుతూ చేతి ఊపి అందరికీ ధైర్యాన్ని ఇచ్చారు.
Oral Cancer: నోటిలో పదే పదే ఈ సమస్య వస్తుందా? అయితే క్యాన్సర్ కావొచ్చు!
అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేని వాతావరణం కారణంగా వ్యోమగాముల శరీరాల్లో అనేక మార్పులు సంభవిస్తాయి. భూమి మీద మనం రోజూ చేసే శారీరక శ్రమ అంతరిక్షంలో లేకపోవడం వల్ల కండరాలు, ఎముకలు బలహీనపడతాయి. అంతేకాకుండా, చెవిలోని వెస్టిబ్యులర్ అవయవం పని తీరులో మార్పులు వచ్చి, మెదడు సమతుల్యత కోల్పోతుంది. దీని ప్రభావంగా వ్యోమగాములకు కొంతకాలం మతిమరుపు, తేలికపాటి త్రిప్పులు వస్తాయి. శరీరంలో రక్తప్రసరణ మారిపోవడం వల్ల తల భాగంలో రక్తం ఎక్కువగా పేరుకుపోతుంది, ఇది ఒత్తిడిని కలిగించవచ్చు.
BCCI : కోహ్లీ ఎఫెక్ట్.. కీలక నిర్ణయంపై బీసీసీఐ యూటర్న్?
అంతరిక్షంలో గడిపిన సమయం వల్ల వ్యోమగాములకు రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. తెల్ల రక్తకణాల సంఖ్య తగ్గిపోవడం, అధిక రేడియేషన్ కారణంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంటాయి. అందుకే భూమికి తిరిగి వచ్చిన అనంతరం సునీతా విలియమ్స్ వంటి వ్యోమగాములను కొన్ని వారాల పాటు వైద్య పర్యవేక్షణలో ఉంచుతారు. శరీరం మళ్లీ భూమి వాతావరణానికి అలవాటు పడేలా ప్రత్యేకమైన వ్యాయామాలు, పోషకాహారాన్ని అందిస్తారు. ఈ ప్రతికూల పరిస్థితులన్నింటినీ ఎదుర్కొని, తిరిగి సాధారణ జీవనానికి చేరుకునేలా చేసిన శిక్షణకు ధైర్య సాహసాలకి సునీతా విలియమ్స్ నిజమైన ప్రేరణగా నిలుస్తున్నారు.
THE MOMENT! Sunita Williams exits the Dragon capsule#sunitawilliamsreturn #SunitaWillams pic.twitter.com/sCsYw7MUgq
— JUST IN | World (@justinbroadcast) March 18, 2025