Railway Job : నర్సింగ్ చేశారా..రూ.44,900 జీతం.. రైల్వేలో జాబ్
రైల్వే జాబ్ (Railway Job) అంటే ఎవర్ గ్రీన్.. ఎందుకంటే అందులో అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి.
- Author : Pasha
Date : 21-05-2023 - 8:27 IST
Published By : Hashtagu Telugu Desk
రైల్వే జాబ్ (Railway Job) అంటే ఎవర్ గ్రీన్.. ఎందుకంటే అందులో అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. అన్నింటికీ మించి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. తాజాగా 28 జాబ్స్ కోసం దక్షిణ రైల్వే నోటిఫికేషన్ ఇచ్చింది. అవన్నీ బీఎస్సీ నర్సింగ్ చేసిన వారి కోసమే.. ఈ విద్యార్హత కలిగిన వారు నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అధికారిక వెబ్ సైట్ https://rrcmas.in/ లో పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. నోటిఫికేషన్ చదివితే అప్లికేషన్ ప్రాసెస్, సెలెక్షన్ ప్రాసెస్ గురించి తెలుస్తుంది.
పెద్ద గుడ్ న్యూస్ ఏమిటంటే ఈ జాబ్ కు (Railway Job) సెలెక్ట్ అయ్యే వాళ్లకు జీతం రూ.44,900 దాకా ఇస్తారు. దీని అప్లికేషన్ ప్రక్రియ మే 5 నుంచే మొదలైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 5 వరకు అప్లికేషన్స్ సబ్మిట్ చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 42 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు.. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.