HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Social Media Startup Koo To Shut Down After Acquisition Talks Fail

Koo App: మూగబోయిన ‘కూ’.. లిటిల్‌ ఎల్లో‌బర్డ్‌ గుడ్‌‌బై

మేడిన్ ఇండియా సోషల్ మీడియా యాప్ ‘కూ’ ప్రస్థానం ఇక ముగిసింది. .

  • Author : Pasha Date : 03-07-2024 - 2:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Koo App

Koo App: మేడిన్ ఇండియా సోషల్ మీడియా యాప్ ‘కూ’ ప్రస్థానం ఇక ముగిసింది. తన కార్యకలాపాలను కూ ఆపేసింది. ఆ కంపెనీ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ ఈ మేరకు లింక్డిన్‌లో ఓ పోస్ట్ చేశారు. డైలీ హంట్‌ సహా వివిధ కంపెనీలతో కూ యాప్ విక్రయానికి సంప్రదింపులు జరిపినా.. అవి సఫలం కాలేదని ఆయన వెల్లడించారు. ‘‘స్థానిక భాషలకు పెద్ద పీట వేస్తూ కూ యాప్ నడిచింది. ఓ దశలో కూ యాప్‌లో 21 లక్షల మంది డైలీ యాక్టివ్‌ యూజర్లు ఉండేవారు. తన నాలుగేళ్ల ప్రయాణంలో ‘కూ’ అనేక ఎత్తుపల్లాలను చూసింది. లిటిల్‌ ఎల్లో బర్డ్‌ ఇక గుడ్‌ బై చెప్తోంది’’ అంటూ తన లింక్డిన్‌ పోస్ట్‌లో రాధాకృష్ణ(Koo App) పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join

అప్రమేయ రాధాకృష్ణ, మయాంకర్‌ బిడవట్కా కలిసి 2019లో ప్రారంభించిన కూ యాప్.. ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని అందరూ భావించారు. కానీ కేవలం ఐదేళ్లలోనే దాని ప్రస్థానానికి తెరపడింది. ఢిల్లీ వేదికగా రైతు ఉద్యమం జరిగిన టైంలో  సోషల్ మీడియా అకౌంట్ల బ్లాకింగ్‌ విషయంలో ట్విటర్‌తో కేంద్రానికి ఘర్షణ జరిగింది. దీంతో అప్పట్లో కీలక ప్రత్యామ్నాయంగా కూ యాప్ తెరపైకి వచ్చింది. ఆ సమయంలో స్వయంగా కేంద్రమంత్రులే కూ యాప్‌ను ప్రమోట్ చేసి సంచలనం క్రియేట్ చేశారు. ఆ పరిణామాలు ట్విట్టర్(ఎక్స్) పెద్ద షాక్ ఇచ్చాయి. ఆ పరిణామాలతో అప్పట్లో కూ యాప్ యూజర్ల సంఖ్య భారీగా పెరిగింది. నైజీరియా, బ్రెజిల్‌ దేశాలకూ తన కార్యకలాపాలను కూ యాప్ విస్తరించింది. తదుపరిగా ఈ కంపెనీ ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంది. దీంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి ఎదురైంది. ఈక్రమంలోనే ఈ ఏడాది ఎంతోమంది ఉద్యోగులను తొలగించింది.

Also Read :Actor Vijay : ప్రజావిశ్వాసం కోల్పోయింది.. ఇక ‘నీట్’ అక్కర్లేదు : హీరో విజయ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Koo App
  • Koo Shut Down
  • social media

Related News

Varun Chakravarthy In Shop

కిరాణా షాప్ లో వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో వరుణ్ చక్రవర్తి

Varun Chakravarthy  టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యుడైన వరుణ్ చక్రవర్తి, తన నిరాడంబరతతో మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. మైదానంలో తన మిస్టరీ స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి భారత్ ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆయన, పతకంతో ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఒక సాధారణ వ్యక్తిలా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చెన్నైలోని తన ఇంటి సమీపంల

  • Mahakumbh Mela sensation Monalisa Bhosle ties knot with boyfriend at Kerala temple

    పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

  • Sriya Reddy

    మార్షల్ ఆర్ట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసిన శ్రీయా రెడ్డి

Latest News

  • ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. మెంటర్ బాధ్యతల నుండి తప్పుకున్న పీటర్సన్!

  • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

  • కొత్త అవతారంలో సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ EX.. అదిరిపోయే ఫీచర్లు, కొత్త కలర్!

  • ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ట్రైల‌ర్ వ‌చ్చేసిందోచ్‌!!

  • రూ. 26,000 కోట్ల నెట్‌వర్త్.. SRH యజమాని ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Trending News

    • గుడ్లను ఉడ‌క‌బెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క‌ వేయాల్సిందే!

    • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd