Viral Video : దీపావళిపార్టీలో శ్రియా శరణ్ రొమాన్స్…మండిపడుతున్న నెటిజన్లు..!!
నటి తాప్సీ పన్ను ఇచ్చిన దీపావళి పార్టీకి బాలీవుడ్ భామలందరూ హాజరయ్యారు. ఇందులో హీరోయిన్ శ్రియాశరణ్ కూడా ఉన్నారు.
- By hashtagu Published Date - 03:33 PM, Fri - 21 October 22

నటి తాప్సీ పన్నుఇచ్చిన దీపావళి పార్టీకి బాలీవుడ్ భామలందరూ హాజరయ్యారు. ఇందులో హీరోయిన్ శ్రియాశరణ్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కెమెరాలకు ఫోజులిచ్చిన శ్రియా శరణ్ కపుల్స్…పబ్లిక్ గ్గానే తన భర్త ఆండ్రీకొస్చెవ్ ను ముద్దాడింది. ఇంతకు ముందు కూడా పలు సార్లు పబ్లిక్ లోనే తన భర్తకు కిస్ చేసింది శ్రియా. ఇప్పుడు తాప్సీ ఇచ్చిన దీపావళి పార్టీలో వీరి జంట నానాహంగామా చేసింది. పబ్లిక్ ముద్దుపెట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు మాత్రం ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. కోరుకోవడానికి ఏ మార్గం అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా…ఇది దీపావళి అని మరొకరు కామెంట్ జోడించారు. అవమానకరంగా ఉంది…దీపావళి పండుగను మురికిగా చేయకండి అంటూ ఓ నెటిజన్ ఘాటుగా కామెంట్ చేశాడు.