Credit Card Myths : క్రెడిట్ కార్డులపై షాకింగ్ అపోహలు ఇక పటాపంచలు !
Credit Card Myths : క్రెడిట్ కార్డుల విషయంలో చాలామందికి చాలా రకాల అపోహలు ఉంటాయి.
- Author : Pasha
Date : 21-04-2024 - 12:30 IST
Published By : Hashtagu Telugu Desk
Credit Card Myths : క్రెడిట్ కార్డుల విషయంలో చాలామందికి చాలా రకాల అపోహలు ఉంటాయి. కొంతమంది క్రెడిట్ కార్డును తీసుకుంటే క్రెడిట్ స్కోర్ ప్రభావితం అవుతుందని భావిస్తుంటారు. ఇంకొంతమంది క్రెడిట్ కార్డును క్యాన్సల్ చేసుకుంటే క్రెడిట్ స్కోర్ బెటర్ అవుతుందని అనుకుంటారు. క్రెడిట్ లిమిట్ తక్కువగా ఉంటే సమస్యలన్నింటికీ పరిష్కారం దొరికినట్టే అనే అభిప్రాయంతో పలువురు ఉంటారు. ఈ అపోహలను క్లియర్ చేసే కథనమిది.
We’re now on WhatsApp. Click to Join
- క్రెడిట్ కార్డు తీసుకున్నంత మాత్రాన క్రెడిట్ స్కోరు(Credit Card Myths) మైనస్ కాదు. క్రెడిట్ కార్డు అప్లికేషన్‌ను ప్రాసెస్ చేసే క్రమంలో మీ క్రెడిట్ స్కోరు కొన్ని పాయింట్లు తగ్గిపోతుంది. అయితే ఒకేసారి ఒకటికి మించి క్రెడిట్ కార్డులకు అప్లై చేస్తే మాత్రం ఎక్కువగా సిబిల్ స్కోర్ డౌన్ అవుతుంది.
- ఆల్ రెడీ వాడుతున్న క్రెడిట్ కార్డులను క్యాన్సల్ చేసుకుంటే క్రెడిట్ స్కోరు పెరగదు. ఉన్న వాటిని క్రమశిక్షణతో వాడితే సిబిల్ స్కోర్ పెరుగుతుంది.
- క్రెడిట్ కార్డును వాడటం వల్ల వచ్చే రివార్డ్ పాయింట్లతో ప్రయోజనం చేకూరదు అనుకోవడం సరికాదు. చిన్నచిన్న నీటి బిందువులు కలిసి మహాసముద్రంగా మారుతాయన్నట్టుగా.. చిన్నచిన్న రివార్డు పాయింట్లు కలిసి మీకు ప్రయోజనాన్ని కలిగిస్తాయి. వాటితో మీరు షాపింగ్ చేయొచ్చు. యుటిలిటీ బిల్లులు కట్టుకోవచ్చు.
Also Read : Tenth – Inter Results : త్వరలోనే టెన్త్, ఇంటర్ రిజల్ట్స్.. విద్యార్థుల్లో ఉత్కంఠ
- సైనప్ బోనస్‌లను చూసి క్రెడిట్ కార్డును తీసుకుంటే తాత్కాలిక ప్రయోజనమే కలుగుతుంది. దీర్ఘకాలం పాటు కార్డును వాడాలి కాబట్టి.. మీరు లాంగ్ టర్మ్‌లో కార్డు వల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి ఆలోచించాలి. సైనప్ బోనస్ ఆఫర్లకు ఆకర్షితమై క్రెడిట్ కార్డులను తీసుకుంటూపోతే క్రెడిట్ స్కోరు డౌన్ కావడం ఖాయం.
- క్రెడిట్ లిమిట్ తక్కువగా ఉంటే మీ క్రెడిట్ స్కోర్ పెరగదు. క్రెడిట్ లిమిట్ ఎంత ఉన్నా.. మీ వినియోగం తీరును బట్టి క్రెడిట్ స్కోర్ డిసైడ్ అవుతుంది.
- క్రెడిట్ కార్డు వినియోగం వల్ల వచ్చే రివార్డు పాయింట్లను ఎన్‌క్యాష్ చేస్తే క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది అనే భావన తప్పు. క్రెడిట్ కార్డు వాడటం వల్ల బోనస్‌గా అందే రివార్డు పాయింట్లను వాడుకునే హక్కు కస్టమర్‌కు ఉంటుంది. ఈవిషయాన్ని సిబిల్ నెగెటివ్‌గా పరిగణించదు.
- క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లు అనేవి తమ అకౌంటులో నుంచే ఇచ్చేవి అనే భావనతో కొందరు కస్టమర్లు ఉంటారు. అది తప్పుడు భావన. బిల్లులను సకాలంలో కట్టినందుకు, తగిన అకౌంట్ బ్యాలెన్సును మెయింటైన్ చేసినందుకు రివార్డు పాయింట్స్ వస్తాయి. మీ లావాదేవీలకు, క్రమశిక్షణకు ప్రోత్సాహకంగా మాత్రమే రివార్డు పాయింట్స్ వస్తాయి.