RuPay Credit Card-UPI : రూపే క్రెడిట్ కార్డ్స్ తో ఇక యూపీఐ పేమెంట్స్.. ఆ రెండు బ్యాంకుల గ్రీన్ సిగ్నల్
RuPay Credit Card-UPI : SBI, ICICI బ్యాంక్ రూపే కార్డ్ హోల్డర్లు కూడా ఇప్పుడు తమ క్రెడిట్ కార్డ్‌లను BHIM యూపీఐతో లింక్ చేసుకోవచ్చు.
- By Pasha Published Date - 04:03 PM, Fri - 14 July 23

RuPay Credit Card-UPI : SBI, ICICI బ్యాంక్ రూపే కార్డ్ హోల్డర్లు కూడా ఇప్పుడు తమ క్రెడిట్ కార్డ్‌లను BHIM యూపీఐతో లింక్ చేసుకోవచ్చు. UPI QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా చెల్లింపులు చేయొచ్చు. ఈ కస్టమర్లు తమ క్రెడిట్ కార్డ్‌ని BHIM UPI యాప్ (BHIM)కి లింక్ చేయడం ద్వారా ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చు. కస్టమర్‌లు UPI QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా ఆన్‌లైన్ పేమెంట్స్ చేయొచ్చు. BHIM యాప్ లో 11 బ్యాంకులకు చెందిన రూపే క్రెడిట్ కార్డ్‌లను లింక్ చేసే వెసులుబాటు ఉంది. ఇప్పుడు బ్యాంకు అకౌంట్స్ నుంచి యూపీఐ పేమెంట్స్ చేస్తున్నట్టే.. ఇకపై SBI, ICICI బ్యాంక్ కస్టమర్లు తమ రూపే క్రెడిట్ కార్డ్స్ తో కూడా అదేవిధంగా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. UPI సదుపాయంపై క్రెడిట్ కార్డ్ వినియోగాన్ని రూపే 2022లో ప్రవేశపెట్టింది. RuPay క్రెడిట్ కార్డ్‌లను Google Pay, Paytm, PhonePe, PayZapp, Freecharge వంటి ప్రసిద్ధ UPI యాప్‌లలో కూడా వాడొచ్చు.
Also read : Ram Charan’s Daughter: క్లీంకార కోసం స్పెషల్ రూమ్, వీడియో షేర్ చేసిన ఉపాసన
BHIM యాప్‌తో రూపే క్రెడిట్ కార్డ్ లింక్ ఇలా..
- మీ ఫోన్ లో BHIM యాప్‌ను తెరవండి.
- అందులో లింక్డ్ బ్యాంక్ అకౌంట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- “ఖాతాను జోడించు” (యాడ్ యువర్ అకౌంట్) విభాగంలో.. “+” గుర్తుపై క్లిక్ చేస్తే “బ్యాంక్ ఖాతా”, “క్రెడిట్ కార్డ్” అనే రెండు ఆప్షన్స్ వస్తాయి.
- క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ను ఎంచుకుని, సంబంధిత కార్డ్‌పై క్లిక్ చేయండి. ఆ వెంటనే యాప్ మీ మొబైల్ నంబర్‌కి లింక్ చేయబడిన క్రెడిట్ కార్డ్ వివరాలను చూపిస్తుంది.
- మీ క్రెడిట్ కార్డ్ యొక్క చివరి 6 అంకెలు, చెల్లుబాటు వ్యవధిని నమోదు చేయండి.
- మీ మొబైల్‌లో వచ్చిన OTPని నమోదు చేయడం ద్వారా కొనసాగండి.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి UPI పిన్‌ను సృష్టించండి.
- ఇక మీరు UPI QR కోడ్‌ని స్కాన్ చేయొచ్చు. రూపే క్రెడిట్ కార్డ్ ను ఎంచుకుని, మీ UPI పిన్‌ను ఎంటర్ చేయడం ద్వారా చెల్లింపులు చేయొచ్చు.