Cat Hired : పిల్లికి జాబ్ వచ్చిందోచ్.. ఏ జాబో తెలుసా ?
Cat Hired : జాబ్.. దీని కోసం అప్లై చేయనివారు ఎవరుంటారు ? ఒక పిల్లి కూడా జాబ్ కు అప్లై చేసింది..ఆశ్చర్యకరంగా అది జాబ్ కు సెలెక్ట్ అయింది. ఇంతకీ ఎలా ?
- Author : Pasha
Date : 17-06-2023 - 10:24 IST
Published By : Hashtagu Telugu Desk
Cat Hired : జాబ్..
దీని కోసం అప్లై చేయనివారు ఎవరుంటారు ?
ఒక పిల్లి కూడా జాబ్ కు అప్లై చేసింది..
ఆశ్చర్యకరంగా అది జాబ్ కు సెలెక్ట్ అయింది. ఇంతకీ ఎలా ?
నలుపు, తెలుపు కాంబినేషన్ లో రంగు కలిగిన పిల్లి అది.. దాని పేరు “డ్యూక్ ఎల్లింగ్టన్ మోరిస్”.. వయసు 14 ఏళ్ళు.. దీనికి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయంలో జాబ్(Cat Hired) వచ్చింది. “మా సరికొత్త వాగ్ బ్రిగేడ్ సభ్యుడు డ్యూక్ ఎల్లింగ్టన్ మోరిస్‌కు స్వాగతం!” అంటూ శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్ట్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. పైలట్ టోపీ, కాలర్ చొక్కా ధరించిన పిల్లి ఫోటోను ఈ ట్వీట్ తో పాటు పోస్ట్ చేసింది. ఇంతకీ ఆ జాబ్ ఏమిటి ? అని ఆలోచిస్తున్నారా ? మరేం లేదు.. ఎయిర్ పోర్ట్ కు వచ్చిపోయే ప్రయాణికులకు టైం పాస్ చేయడమే!!
Also read : Viral Video: తైవాన్ మెట్రోలో స్టేషన్ మాస్టర్ పిల్లి నియామకం, సో క్యూట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్.
Purrlease welcome our newest Wag Brigade member, Duke Ellington Morris! 🐱 pic.twitter.com/FDSw1a55Ef
— San Francisco International Airport (SFO) ✈️ (@flySFO) June 8, 2023
2010లో శాన్ ఫ్రాన్సిస్కో లోని ఒక వీధిలో తిరుగుతున్న ఈ పిల్లిని యానిమల్ కేర్ అండ్ కంట్రోల్ టీమ్ అదుపులోకి తీసుకొని సాకింది. ఆ తర్వాత ఈ పిల్లిని ఐదేళ్ల బాలిక దత్తత తీసుకుంది. ఆమె ఈ పిల్లితో యానిమల్ అసిస్టెడ్ థెరపీ కోర్సును చేయించింది. దీంతో డ్యూక్ ఎల్లింగ్టన్ మోరిస్ పిల్లి స్వభావం, ప్రవర్తనకు శాన్ ఫ్రాన్సిస్కో SPCA నుంచి సర్టిఫికేషన్ లభించింది. శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయం 2013లో వాగ్ బ్రిగేడ్ స్థాపించింది. ప్రయాణికులకు టైం పాస్ చేయగల శిక్షణ పొందిన జంతువులను ఇందులోకి రిక్రూట్ చేసుకోవడం ప్రారంభించింది. మొదట్లో కుక్కలకు మాత్రమే వాగ్ బ్రిగేడ్ లోకి తీసుకునేవారు. అయితే ఇప్పుడు శిక్షణ పొందిన పిల్లులు, కుందేళ్లు, పందులను కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. జంతువులకు విమానాశ్రయాల్లో జాబ్స్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. సిన్సినాటి/నార్తర్న్ ఒహియో ఎయిర్‌పోర్ట్ 2017లోనే శిక్షణ పొందిన గుర్రాలను దత్తత తీసుకుంది.