Putin Get ill: పుతిన్ కు సిరీయస్!
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధం ప్రారంభమై నెలలు గడుస్తున్నప్పటికీ ముగింపు పలకడం లేదు.
- By Balu J Published Date - 02:39 PM, Mon - 16 May 22

ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధం ప్రారంభమై నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ముగింపు పలకడం లేదు. అయితే ఈ ఇటీవలనే విక్టరీ డేను సెలబ్రేట్ చేసుకున్న రష్యా యుద్ధ ముగింపుకు సంబంధించి ఏదైనా ప్రకటన చేస్తుందని భావించాయి పలు దేశాలు. అలాంటి ప్రకటన వెలువడకపోవడంతో రెండు దేశాలపై యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. అయితే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం గురించి ఎలాంటి వార్తలు వినిపిస్తున్నాయో.. మరోవైపు పుతిన్ అనారోగ్యంపై కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజా ఆరోగ్య పరిస్థితిపై ఓ బ్రిటీష్ మాజీ గూడచారి పుతిన్ ఆరోగ్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్‌ను తొలగించేందుకు రంగం సిద్ధమవుతోందని, ఈ ఏడాది చివరి నాటికి యుద్ధం ముగుస్తుందని అన్నాడు. ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం క్రమక్రమంగా బలహీన పడుతోందని, ఈ ఏడాది చివరి నాటికి యుద్ధం ముగుస్తుందని అభిప్రాయపడ్డాడు. ఈ ప్రక్రియ నాయకత్వ మార్పుకు దారితీస్తుందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించాడు. ‘రష్యా అధ్యక్షుడు బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడని’ కూడా తెలిపాడు. అనేక అనారోగ్య సమస్యలు పుతిన్ ను బాధిస్తున్నాయని, ఆయన బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడని స్పష్టం చేశాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్సలో భాగంగా స్టెరాయిడ్ వాడారని, ఆ కారణంగానే పుతిన్ ముఖం వాచిపోయిందని ఆరోపించాడు.