Rs 8 to Rs 445 : లక్ష పెడితే 55 లక్షలయ్యాయి.. రూ.8 నుంచి రూ.445కు పెరిగిన షేరు ధర
Rs 8 to Rs 445 : సూరజ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్.. ఈ షేరు ధర గత నాలుగేళ్లలో భారీగా పెరిగింది.
- By Pasha Published Date - 04:00 PM, Sat - 3 February 24

Rs 8 to Rs 445 : సూరజ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్.. ఈ షేరు ధర గత నాలుగేళ్లలో భారీగా పెరిగింది. 2019 సంవత్సరంలో ఈ స్టాక్ ధర రూ. 8 ఉండగా.. ఇప్పుడు దాని రేటు వేగంగా ఎగబాకి రూ. 445 కు చేరుకుంది. ఈ షేరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు నాలుగేళ్లలో 5400 శాతం రిటర్న్స్ ఇచ్చింది. గత నెల వ్యవధిలో కూడా సూరజ్ ప్రొడక్ట్స్ షేరు రూ. 425 నుంచి రూ. 445 కు పెరిగింది. అంటే గతనెల రోజుల్లోనూ ఈ షేరు ధర 4 శాతం పెరిగింది. గత 6 నెలల గమనాన్ని పరిశీలిస్తే.. సూరజ్ ప్రొడక్ట్స్ షేరు ధర రూ. 229 నుంచి 95 శాతం పెరిగి రూ. 445కు చేరింది. ఏడాది లెక్కను చూస్తే.. రూ. 135 నుంచి రూ. 445 కు పెరిగింది. అంటే సంవత్సరం వ్యవధిలో ఈ స్టాక్ ధర 230 శాతం పెరిగిందన్న మాట. రెండేళ్ల వ్యవధిలో ఈ షేరు ధర రూ. 112 నుంచి రూ. 445 కు చేరింది. అంటే 300 శాతం రిటర్న్స్ ఇచ్చింది. గత మూడేళ్ల వ్యవధిలో రూ .35 నుంచి రూ.445కు ఎగబాకి, ఏకంగా 1200 శాతం రిటర్న్స్ ఇచ్చింది. అదే నాలుగేళ్లలో రూ. 8 నుంచి 5400 శాతం పెరిగి రూ. 445 కు(Rs 8 to Rs 445) చేరుకుంది.
We’re now on WhatsApp. Click to Join
ఇన్వెస్ట్‌మెంట్ పరంగా చూస్తే.. మనం ఒకవేళ 6 నెలల క్రితం ఈ స్టాక్‌లో రూ. లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే అవి ఇప్పుడు రూ. 1.95 లక్షలుగా మారి ఉండేవి. ఏడాది క్రితం రూ. లక్ష పెట్టినోళ్లకు ఇప్పుడు రూ. 3.30 లక్షలు వచ్చాయి. మూడేళ్ల కిందట ఇందులో రూ. లక్ష పెట్టినోళ్ల ఇప్పుడు రూ. 13 లక్షలు వచ్చాయి. అదే నాలుగు సంవత్సరాల కిందట ఈ స్టాక్‌లో రూ. లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు మనకు రూ. 55 లక్షలు వచ్చి ఉండేవి. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట విలువ రూ. 455.60 కాగా.. కనిష్ట విలువ రూ. 116.50. సూరజ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 506.62 కోట్లు.
Also Read : 5 Foods: పేగుల్లోని చెడు బ్యాక్టీరియాపై ‘పంచ్’.. 5 సూపర్ ఫుడ్స్ ఇవే
వారెవా.. ఓలెక్ట్రా గ్రీన్ టెక్
స్టాక్ మార్కెట్ (Stock Market) కొన్ని షేర్లు ఊహించని రేంజ్ లో లాభాల పంట పండిస్తుంటాయి. ఇన్వెస్టర్లకు సిరుల పంట పండిస్తుంటాయి. ఓలెక్ట్రా గ్రీన్ టెక్ అనే కంపెనీ షేరు మదుపరులకు కోట్ల రూపాయలు తెచ్చిపెట్టింది. కేవలం 10 ఏళ్లలో లక్ష రూపాయలను కోటి 70 లక్షలు చేసింది. 2014 సంవత్సరంలో 10 రూపాయలు ఉన్న ఈ షేరు ప్రస్తుతం అంటే 2024 జనవరి నాటికి 1780 రూపాయలకు ఎగబాకింది. అంటే ఆ రోజు లక్ష రూపాయలు పెట్టి షేర్లు కొన్న వారికి నేడు ఒక కోటి 70 లక్షల రూపాయలు రానున్నాయి.ఓలెక్ట్రా గ్రీన్ టెక్ అనే కంపనీ ప్రొఫైల్ చూస్తే.. ఇది EV సెగ్మెంట్ లో ఉంది. ఈ కంపెనీ ఎలెక్ట్రిక్ బస్సులను తయారు చేస్తుంది. గ్రీన్ ఎనర్జీ డెవెలప్‌మెంట్‌లో కీలక భూమిక పోషిస్తోంది ఈ కంపెనీ. ఈ షేర్లు రానున్న రోజుల్లో మరింత పెరగొచ్చని అంచనా.
గమనిక : ఇక్కడ పేర్కొన్న స్టాక్‌లు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. మీరు వీటిలో దేనిలోనైనా డబ్బు పెట్టుబడి పెట్టాలనుకుంటే, ముందుగా ధృవీకరించబడిన పెట్టుబడి సలహాదారుని సంప్రదించండి.