Rs 500 Notes Alert : రూ.500 నోట్లు.. బీ అలర్ట్
రూ.2000 నోట్లు మార్కెట్ నుంచి వెళ్లిపోతున్న ఈ తరుణంలో రూ.500 నోట్లపై (Rs 500 Notes Alert) లావాదేవీలు భారీగా పెరగనున్నాయి. అందుకే ప్రతి ఒక్కరు చాలా అలర్ట్ గా ఉండాలి.
- By Pasha Published Date - 10:20 AM, Tue - 23 May 23
రూ.2000 నోట్ల ఉపసంహరణ ప్రక్రియ ఈరోజు (మంగళవారం) మొదలైంది. ఆ నోట్లను బ్యాంకుల ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెనక్కి తీసుకునే ప్రక్రియ స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 30 వరకు ఈ ప్రాసెస్ కొనసాగుతుంది. రూ.2000 నోట్లు మార్కెట్ నుంచి వెళ్లిపోతున్న ఈ తరుణంలో రూ.500 నోట్లపై (Rs 500 Notes Alert) లావాదేవీలు భారీగా పెరగనున్నాయి. అందుకే ప్రతి ఒక్కరు చాలా అలర్ట్ గా ఉండాలి. నకిలీ కరెన్సీ ముఠాలు నకిలీ రూ.500 నోట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు ఈ టైం ను వాడుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రూ.500 నోట్ల (Rs 500 Notes Alert) పోలికల గురించి మనకే కనీస అవగాహన ఉండాలి. నకిలీ 500 నోటుకు.. అసలు 500 నోటుకు ఉండే తేడా ఏంటో తెలుసుకోవాలి. ఈ సమాచారాన్ని అందరికీ తెలియజేయాలి.
500 నోటులో ఇవన్నీ ఉంటాయి..
→ రూ.500 నోటుపై మహత్మా గాంధీ బొమ్మ, ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటాయి.
→ రూ.500 నోటుపై మరో వైపున రెడ్ ఫోర్ట్ బొమ్మ ఉంటుంది.
→ రూ. 500 నోట్లపై జియోమెట్రిక్ ప్యాట్రన్స్ ఉంటాయి.
→ రూ.500 నోట్లు స్టోన్ గ్రే కలర్లో ఉంటాయి.
→ రూ.500 నోట్ల సైజ్ 66 ఎంఎం × 150 ఎంఎం ఉంటుంది. మధ్యలో మహాత్మా గాంధీ బొమ్మ ఉంటుంది.
→ రూ.500 నోట్లపై 500 అని దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది.
→ రూ.500 నోట్లపై భారత్, ఇండియా అని చిన్న అక్షరాల్లో రాసి ఉంటుంది.
also read : 2000 Notes: నేటి నుంచే బ్యాంకుల్లో రూ. 2000 నోట్ల మార్పిడి.. ఇవి తెలుసుకోండి..!
→ రూ.500 నోట్లపై 500 అనే మార్క్ ఉంటుంది.
→ రూ.500 నోటు ముందు భాగంలో తెల్ల స్థలంలో 500 అని ఉంటుంది. అయితే దీన్ని లైట్‌కు పెట్టి చూడాలి. ఇండియా, ఆర్బీఐ అని రాసి ఉండే ఒక స్ట్రిప్ ఇందులో ఉంటుంది. ఈ స్ట్రిప్ కలర్ గ్రీన్, బ్లూ లాగా మారుతుంది.
→ రూ.500 నోట్లపై మహాత్మా గాంధీ బొమ్మకు కుడి వైపున గవర్నర్ సంతకం, గ్యారంటీ క్లాజ్, ప్రామిస్ క్లాజ్ ఉంటాయి. ఆర్బీఐ ఎంబ్లెమ్ కూడా ఉంటుంది.
→ రూ.500 నోట్లపై మహాత్మా గాంధీ బొమ్మ, ఎలెక్ట్రోటైప్ 500 వాటర్‌మార్క్ చేసి ఉంటారు.
→ రూ.500 నోట్లపై మహాత్మా గాంధీ బొమ్మ కింద హిందీ, ఇంగ్లీష్‌లో మహాత్మా గాంధీ అని రాసి ఉంటుంది.
→ రూ.500 నోటుకు కుడి వైపున అశోకుడి స్తంభం ఉంటుంది. దీనిపై రూ.500 చిన్న రౌండ్లో రాసి ఉంటుంది. ఎడమ వైపు పైన, కుడి వైపున కింద కరెన్సీ నోటు నెంబర్లు ఉంటాయి.
→ నోటు పైన కుడి, ఎడమ వైపున రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్, హిందీలో ఉంటుంది. దీనికి మధ్యలో ఐదు వందలు అని హిందీలో రాసి ఉంటుంది.
→ నోటు వెనుక భాగంలో చూస్తే.. ఎడమ వైపున తెల్ల స్థలంలో గాంధీ బొమ్మ, 500 ఉంటాయి.
→ స్వచ్ఛ్ భారత్ అని కళ్లజోడులో హిందీలో రాసి ఉంటుంది. దీని కింద రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అని హిందీలో ఉంటుంది. ఐదు వందలు అని వివిధ భాషల్లో రాసి ఉంటుంది. రెడ్ ఫోర్ట్ ఉంటుంది.
Tags
Related News
TTD Exchange Rs 2000 Notes: రూ.3.2 కోట్ల విలువైన రూ.2,000 నోట్లను మార్చిన టీటీడీ
తిరుమలలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని నిర్వహిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం రూ.3.2 కోట్ల విలువైన రూ. 2000 నోట్లను మార్చుకుంది.