RRR Memes: రిలీజయ్యే టైమ్ కి హీరోలిలా అయిపోతారేమో!
తెలుగు ఇండస్ట్రీలో ఎస్ఎస్ రాజమౌళి ఓ సంచలనం.. ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే.. టాలీవుడ్ యే కాకుండా.. ఇతర ఇండస్ట్రీలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటాయి.
- By Balu J Published Date - 12:29 PM, Tue - 4 January 22

తెలుగు ఇండస్ట్రీలో ఎస్ఎస్ రాజమౌళి ఓ సంచలనం.. ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే.. టాలీవుడ్ యే కాకుండా.. ఇతర ఇండస్ట్రీలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటాయి. మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి ప్రతిష్టాత్మక చిత్రాలను అందించడమే అందుకు కారణం. ఇండియాలోనే కాకుండా, ఇతర దేశాల్లోనూ రాజమౌళికి ఫ్యాన్స్ ఉన్నారంటే, ఆయన సినిమాలు ప్రభావమే. డైరెక్టర్ గా రాజమౌళికి ఎంత పేరుందో.. ఆయన సినిమాల విడుదల విషయంలోనూ అంతకంటే ఎక్కువగా కంప్లైంట్స్ ఉన్నాయి. ఒక్కో సినిమాకు ఆయన మూడు నుంచి ఐదేండ్ల సమయం తీసుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. గతంలో బాహుబలి సిరీస్ కు రాజమౌళి దాదాపు ఐదేళ్ల సమయం తీసుకున్నాడు. ఇక హీరో ప్రభాస్ అయితే ఆ టైంలో ఏ సినిమానూ ఒప్పుకోని పరిస్థితి ఉందంటే రాజమౌళి ఎంత టైం తీసుకుంటారనేది స్పష్టంగా తెలుస్తోంది.
కొమురం భీం, అల్లూరి సీతరామరాజు యోధుల నేపథ్యంగా తెరకెక్కిన ‘‘ఆర్ఆర్ఆర్’’ సినిమా కూడా అనుకున్న సమయానికి రాకపోవడంతో ప్రేక్షకులు ఆయనపై ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘రాజమౌళి సినిమాలన్నీ ఇంతేరా బాబూ’ అంటూ పెదవి విరుస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాను ఎప్రిల్ నెలలోనూ విడుదల చేస్తారా.. లేక ఒకటో తేదీన ఫూల్ చేస్తారా…?? అంటూ, ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అయ్యేలోపు నేను ముసలోడిని అయిపోతానేమో’ అనే పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు.